×
Ad

Bheemla Naayak : ‘ఈసారి కూడా మిస్ అవదు’.. నిర్మాత నాగవంశీ కాన్ఫిడెన్స్!..

‘భీమ్లా నాయక్’ నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది..

  • Published On : November 21, 2021 / 04:53 PM IST

Bheemla Naayak Post Production

Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న సినిమా.. ‘భీమ్లా నాయక్’.. పవన్‌కి జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్, రానా పక్కన సంయుక్త మీనన్ నటిస్తున్నారు..

Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..

పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పవన్, రానా గ్లింప్స్, పాటలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.

Most Eligible Bachelor : ‘ఆహా’ లో అదరగొడుతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..

ముందునుండి సినిమాను సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న రిలీజ్ చేస్తామని చెప్తున్నప్పటికీ.. పరిస్థితులు మారుతుండడంతో ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా తప్పదనే వార్తలు వస్తున్నాయి. కట్ చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లో ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికే వస్తాడని కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్.

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి ట్వీట్.

అందుకు తగ్గట్లే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే ఇప్పుడు నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. ‘ఈసారి కూడా మిస్ అవదు.. జనవరి 12న థియేటర్లలో కలుద్దాం’ అంటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న పిక్ షేర్ చేశారు.

Bigg Boss 5 Telugu : అనీ మాస్టర్ ఎలిమినేషన్!

ఇంతకుముందు అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా అప్పుడు కూడా ఇలాగే ‘ఈసారి కూడా మిస్ అవదు’ అని ట్వీట్ చేశారు నాగవంశీ. 2020 జనవరి 12న సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. సరిగ్గా అదే జనవరి 12 నాడు మళ్లీ ‘భీమ్లా నాయక్’ తో సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటూ కాన్ఫిడెంట్‌గా నిర్మాత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.