bheemla Nayak Trailer: ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 22నే భీమ్లా ట్రైలర్!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని ‘భీమ్లా నాయక్’ పేరుతో దర్శకుడు చంద్ర సాగర్ రీమేక్..
- Naresh Mannam
- Updated on- February 19, 2022 / 04:17 PM IST
Bheemla Nayak Trailer
bheemla Nayak Trailer: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని ‘భీమ్లా నాయక్’ పేరుతో దర్శకుడు చంద్ర సాగర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఇప్పుడు జనవరి 25న థియేటర్లలోకి రానుంది.
Lyrical Songs: షేక్ చేస్తోన్న సాంగ్స్.. సోషల్ మీడియాలో రికార్డుల మోత
రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై నెలకొన్న హైప్ అయితే ఇప్పుడు అంతా ఇంతా కాదు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న మేకర్స్.. సినిమా గురించి ఒక్కో అప్డేట్ ఇస్తూ అభిమానులను విపరీతంగా హైప్ పెంచేస్తున్నారు. ఇప్పటికే టీజర్లు, సాంగ్స్ తో సోషల్ మీడియాను మోతెక్కించిన మేకర్స్ రిలీజ్ కు మూడు రోజుల ముందు ఫిబ్రవరి 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
Bheemla Nayak: ఓటీటీల పోటీ.. రికార్డు ధర పలికిన భీమ్లా నాయక్!
కాగా, అదే రోజున భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల చేస్తామని సినిమా నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిజానికి శని, ఆదివారాలలో ట్రైలర్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. పవన్ అభిమానులు కూడా అదే ఆస్సీయించారు. కానీ.. దర్శక, నిర్మాతలు మాత్రం బుధవారం ఈవెంట్ తోనే ఈ ట్రైలర్ వదలనున్నారు. అయితే.. ఇది పవర్ స్టార్ మార్క్ పవర్ ప్యాక్ ట్రైలర్ రాబోతుందని మాత్రం నిర్మాత ప్రకటించేశాడు.
