Vijay Antony : విజయ్ ఆంటోనీ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొని..
నేడు విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ తండ్రి కూడా..
- gum 95921
- Published On : September 19, 2023 / 09:09 PM IST
Bichagadu hero Vijay Antony father and daughter tragedy
Vijay Antony : బిచ్చగాడు (Bichagadu) హీరో విజయ్ ఆంటోనీ ఇంట నేడు విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు లారా (Laura) ఈరోజు తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కర్ని కలిచివేస్తుంది. సోషల్ మీడియా వేదికగా.. ఆయనకు, కుటుంబానికి సానుభూతుని తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఒక విషయం నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్ ఆంటోనీ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొనే మరణించారట.
Vicky Kaushal – Katrina Kaif : కత్రినాతో గొడవ వస్తే.. విక్కీ కౌశల్ చేసే మొదటి పని ఏంటో తెలుసా..?
విజయ్ ఆంటోనీకి ఏడేళ్ల వయసు ఉన్న సమయంలోనే ఆయన తండ్రి మరణించారట. తన తండ్రి ఎక్కువ మందు తాగేవారట. ఒక సమయంలో ఎమోషనల్ అయ్యి ఆయన సూసైడ్ చేసుకున్నారని గతంలో విజయ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. తన తండ్రి సూసైడ్ తరువాత తనని, తన సిస్టర్ ని వాళ్ళ అమ్మే చూసుకుంటూ వచ్చారని తెలియజేశాడు. ఇక ఇప్పుడు విజయ్ ఆంటోనీ కూతురు కూడా అలానే చనిపోవడం అందర్నీ బాధకి గురి చేస్తుంది.
Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కొత్త మూవీ అప్డేట్.. ‘మార్టిన్ లూథర్ కింగ్’గా..
కాగా లారా ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతుంది. అయితే లారా ఆత్మహత్య ఎందుకు చేసుకుందా అనే దాని గురించి ఇంకా సరైన కారణాలు ఎవరికీ తెలియలేదు. చదువుల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. విజయ్ ఆంటోనీకి లారాతో పాటు మరో కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా, సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న విజయ్ ఆంటోనీ.. ఇటీవల బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో విజయ్ కి కూడా యాక్సిడెంట్ అయ్యి చావు వరకు వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఈ విషాదం ఆ కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తుంది.
