Akhil Akkineni Movie : అక్కినేని అఖిల్, కొత్త డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. మూవీ టైటిల్ ఏంటి? ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టైటిల్ సహా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అఖిల్ పుట్టినరోజు కానుకగా అంటే.. ఏప్రిల్ 8 న టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అఖిల్ కొత్త సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అఖిల్ చివరి మూవీ ఏజెంట్. అదొచ్చి రెండేళ్లు కావొస్తోంది. దీంతో అఖిల్ కొత్త సినిమా గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది.
Also Read : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. జానర్ ఏంటి, షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..
వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో అఖిల్ యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్. దీనికి ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 8న టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్.
ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే. పుట్టిన రోజు కానుకగా ఏదో ఒక అప్ డేట్ కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అఖిల్ కెరీర్ లో ఇది 6వ సినిమా. ఇందులో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం మీసాలతో సరికొత్త మాస్ లుక్ లో అక్కినేని యువ హీరో కనిపించనున్నాడు.