Nagavamsi : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. జానర్ ఏంటి, షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..

త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్న అల్లు అర్జున్.. ఈ మూవీలో కుమారస్వామిగా కనిపించనున్నారు అంటూ జోరుగా వార్తలు వచ్చాయి.

Nagavamsi : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. జానర్ ఏంటి, షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..

Updated On : April 1, 2025 / 5:11 PM IST

Nagavamsi : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రానున్న మూవీ జానర్ ఏంటి? షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ కానుంది? అనేది తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై నిర్మాత నాగవంశీ కీలక అప్ డేట్ ఇచ్చారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చే మూవీ పూర్తిగా మైథలాజికల్‌ జానర్‌ అని ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు. అయితే, సోషియో ఫాంటసీ చిత్రం మాత్రం కాదన్నారాయన. పురాణాల ఆధారంగానే అన్ని సన్నివేశాలు ఉంటాయని వివరించారు. ఇక, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేశారు నాగవంశీ. అక్టోబర్‌ నుంచి షూటింగ్‌ స్టార్ట్ కానుందని వెల్లడించారు.

Also Read : ద‌మ్ముంటే నా సినిమాల‌ను బ్యాన్ చేయండి.. వెబ్ సైట్లు, నెగిటివ్ రివ్యూల మీద నిర్మాత‌ నాగ‌వంశీ ఫైర్‌

త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్న అల్లు అర్జున్.. ఈ మూవీలో కుమారస్వామిగా కనిపించనున్నారు అంటూ జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాగవంశీ కూడా మైథలాజికల్‌ జానర్‌ అని చెప్పడంతో బన్ని లుక్‌ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కుమారస్వామిగా ఉన్న ఘిబ్లి ఇమేజ్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.