Naga vamsi : దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి.. వెబ్ సైట్లు, నెగిటివ్ రివ్యూల మీద నిర్మాత నాగవంశీ ఫైర్
మ్యాడ్ స్క్వేర్ లో కంటెంట్ ఉంది కాబట్టే.. హిట్ అయిందని నిర్మాత నాగవంశీ అన్నారు.

Producer Naga vamsi press meet mad square
రివ్యూలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై నిర్మాత నాగవంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాడ్ స్క్వేర్‌లో కంటెంట్ ఉంది కాబట్టే హిట్ అయిందని అన్నారు. హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు కూడా ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు.
నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మ్యాడ్ స్క్వేర్. 2023లో వచ్చిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే.. పలు వెబ్‌సైట్లలో ఈ చిత్రానికి నెగిటిట్ రివ్యూలు వచ్చాయి. దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు.
Chiranjeevi – Anil Ravipudi : మెగా157 గ్యాంగ్ ఇదే.. క్యూట్ వీడియో చూశారా ?
మంగళవారం నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడారు. కంటెంట్ లేకపోయిన కూడా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదన్నారు. ఎలా ఉన్నా చూడడానికి ఇదేం బాహుబలి2, పుష్ప2, కేజీఎఫ్2 కాదన్నారు. సినిమాలో కంటెంట్ లేకుండా చూడడానికి ఇందులో స్టార్ హీరోలు నటించలేదన్నారు.
వేరే మూవీలు బాగోలేదని ఈ చిత్రాన్ని చూడటం లేదన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. తాను థియేటర్లలో చాలా సార్లు సినిమా చూశానని, ప్రేక్షకుల స్పందన బాగుందన్నారు. ఆడియన్స్ కు తెలిసినంత బాగా రివ్యూవర్‌లను తెలియడం లేదా అని ప్రశ్నించారు.
Peddi Glimpse : ‘పెద్ది’ గ్లింప్స్ కి దేవి హెల్ప్?
‘నా మీద పగ ఉంటే దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. నా దగ్గర యాడ్ తీసుకోకండి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్ రన్ అవుతాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే యూట్యూబ్ ఛానెళ్లు పని చేస్తాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పని చేస్తాయి. సినిమాను చంపకండి. సినిమా ఆడుతున్నప్పుడు కూడా కంటెంట్ లేని సినిమా ఎందుకు ఆడుతుందో తెలియడం లేదు అంటూ తీర్పులు ఇవ్వకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి.’ అంటూ నాగవంశీ మండిపడ్డారు.