Chiranjeevi – Anil Ravipudi : మెగా157 గ్యాంగ్ ఇదే.. క్యూట్ వీడియో చూశారా ?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మెగా 157 గ్యాంగ్‌ను ప‌రిచ‌యం చేశారు.

Chiranjeevi – Anil Ravipudi : మెగా157 గ్యాంగ్ ఇదే.. క్యూట్ వీడియో చూశారా ?

Chiranjeevi Anil Ravipudi the gang of mega157 video viral

Updated On : April 1, 2025 / 12:16 PM IST

‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీతో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉగాది రోజున‌ ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనింగ్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే స్ర్కిప్ట్ వ‌ర్క్ పూర్తి అయిన‌ట్లు స‌మాచారం.

తాజాగా ఈ చిత్రం కోసం ప‌ని  చేస్తున్న‌ టీమ్ వివ‌రాల‌ను పంచుకుంటూ ఓ ప్ర‌త్యేక వీడియోను విడుద‌ల చేశారు. చిరు నటించిన సినిమాల్లోని డైలాగ్‌ల‌ను చెబుతూ ఒక్కొటీమ్‌ చేయనున్న వర్క్‌ను వివరించారు.

ఈ వీడియోలో.. కారు దిగి చిరంజీవి న‌డుచుకుంటూ రాగా.. మిమ్మ‌ల్ని సూప‌ర్ కామెడీ టైమింగ్‌లో ‘చూడాల‌ని వుంది’ అంటూ డైరెక్ష‌న్ టీమ్ అంటుంది. ‘అన్నయ్య’ మా మెగాస్టార్ జెమ్.. మేం కూడా జెమ్స్‌లా పని చేస్తాం.. మేం డైలాగ్ రైటర్స్ ప‌రిచ‌యం చేసుకుంటారు. ఇలా ఒక్కొ టీమ్ ప‌రిచ‌యం చేసుకుంటూ ఉంటుంది.

Peddi Glimpse : ‘పెద్ది’ గ్లింప్స్ కి దేవి హెల్ప్?

ఆఖ‌రిలో ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ బ్లాక్ బస్టర్ అని సాహు గారపాటి, సుష్మిత కొణిదెలు పరిచయం చేసుకోగా.. ఇంటి పేరు ఏం చెప్పావు అని సుష్మితను చిరు అడుగుతారు. కొణిదెల అని చెబితే.. ఆ పేరుని నిలబెట్టాల‌ని అంటారు. ఇక ద‌ర్శ‌కుడు ఎక్క‌డ అని అడుగ‌గా.. గ్యాంగ్ లీడ‌ర్ పోస్ట‌ర్‌తో వ‌స్తాడు అనిల్ రావిపూడి. తెలుస‌య్యా.. ఈ గ్యాంగ్‌కు నువ్వే లీడ‌ర్ అని చిరు అంటారు. ఇక వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ర‌ప్ఫాడిద్దాం అని అంద‌రూ చెబుతారు.

ఈ చిత్రం సంక్రాంతి 2026కి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.