Bigg Boss 10 Telugu Day 3 Full Episode : బిగ్ బాస్ 10 ‘డే 3’ ఫుల్ ఎపిసోడ్.. బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్.. వామ్మో రోహిత్ మామూలోడు కాదు..
రెండు టీమ్స్ లో ఎవరో ఒకర్ని హై రిస్క్ లో పెట్టాలి. (Bigg Boss 10 Telugu Day 3 Full Episode)
- Saketh U
- Published on- September 10, 2026 / 12:37 AM IST
Bigg Boss 10 Telugu Day 3 Full Episode
Bigg Boss 10 Telugu Day 3 Full Episode : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మూడో రోజుకు వచ్చింది. నిన్న పెట్టిన గన్ ఫైటింగ్ లో రెండు టీమ్స్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించాయని ఎవరూ గెలవలేదని తేల్చేసాడు బిగ్ బాస్. అనంతరం రెండు టీమ్స్ లో ఎవరో ఒకర్ని హై రిస్క్ లో పెట్టాలి. అది టీమ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని చెప్పాలి అన్నాడు. బ్లూ టీమ్ లీడర్ రామ్ ప్రసాద్ తనే వెళ్తాను అని క్లారిటీగా చెప్పేసాడు. టీమ్ మెంబర్స్ వద్దు, త్రిగున్ వద్దు అన్నా వెళ్తాను అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ముందే అనుకున్నట్టే రెడ్ టీమ్ లో రోహిత్ తెలివిగా తప్పించుకొని చరణ్ ని ఇరికించాడు. వాళ్ళ టీమ్ లో వాళ్ళే గొడవలు పెట్టుకునేలా చేసాడు రోహిత్. చరణ్ ని హై రిస్క్ లో పెట్టారు. పైగా రోహిత్ కాసేపు ఏడ్చినట్టు నటించి వర్షిణికి దగ్గరవడానికి ట్రై చేసాడు.
అనంతరం దేబ్జానీ తనకు నాగార్జున ఇచ్చిన బ్యాడ్జీలను కొంతమందికి ఇచ్చింది. రామ్ ప్రసాద్, చరణ్ హై రిస్క్ లో ఉండటంతో వాళ్ళు టీమ్స్ లో ఉండరు అని బిగ్ బాస్ చెప్పాడు. బ్లూ టీమ్ కి రామ్ ప్రసాద్ లీడర్ కాబట్టి కొత్త లీడర్ ని ఎన్నుకోమన్నారు. దీంతో బ్లూ టీమ్ కి దేబ్జానీ ని లీడర్ గా ఎన్నుకున్నారు.
Also Read : Maremma Reivew: ‘మారెమ్మ’ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడు కొడుకు హీరోగా మొదటి సినిమా.. ఎలా ఉందంటే?
ఎప్పట్లాగే రోహిత్ పని చేయడానికి తప్పించుకోడానికి ట్రై చేసాడు. దాంతో సుధీర్ – రోహిత్ మధ్య ఒక గొడవ అయింది. రోహిత్ నేను వాష్ చేయను గిన్నెలు మాటి మాటికీ అని తప్పించుకోడానికి ట్రై చేసాడు. నా చేతులు పాడైపోతాయి, నా మాయిశ్చరైజ్ పోతుంది అంటూ సాకులు చెప్పాడు.
ఈ పనుల గొడవతో బిగ్ బాస్ ఎవరో ఒక టీమ్ మాత్రమే అన్ని పనులు చేయాలి ఇంకో టీమ్ చేయక్కర్లేదు అన్నాడు. కానీ ఏ టీమ్ చేయాలి, ఏ టీమ్ మానిటర్ చేయాలి అని వాళ్లనే డిసైడ్ చేసుకోమన్నాడు. దాంతో రెండు టీమ్స్ మధ్య బాగానే గొడవ అయింది. ఎప్పట్లాగే రోహిత్ అందరితో గొడవ పెట్టుకున్నాడు. త్రిగున్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవే అయింది. రోహిత్ పనులేమీ చేయకుండా పక్క టీమ్ మీద పడ్డాడు. గొడవ అంతా అయ్యాక బ్లూ టీమ్ మానిటరింగ్, రెడ్ టీమ్ పనులు చేయడానికి డిసైడ్ అయ్యారు. దీంతో బ్లూ టీమ్ లీడర్ దేబ్జానీ ఎవరు ఏ పని చేయాలో చెప్పింది.
Also Read : Ranabaali Teaser : ‘రణబాలి’ టీజర్ వచ్చేసింది.. సింగనమల బొబ్బిలిగా విజయ్ దేవరకొండ అదరగొట్టాడుగా..
అయితే ఇందులో షాలినికి వాష్ రూమ్స్ క్లీన్ చేయమని ఇచ్చారు. అయితే తను ఆ పని చేయకుండా తన పవర్ ని వాడుకొని వర్షిణికి ఆ డ్యూటీ ఇచ్చేసింది. దీంతో వర్షిణి బిగ్ బాస్ లో ఉన్నంతకాలం వాష్ రూమ్స్ క్లీన్ చేయాలి. ఇక రోహిత్ త్రిగున్ పై నెగిటివిటి ని తన టీమ్ దగ్గర బాగా ప్రచారం చేసాడు. మొత్తానికి రోహిత్ చాలా సేఫ్ గా తన టీమ్ మెంబర్స్, అగ్నిపరీక్ష బ్యాచ్ ని వాడుకొని తనని ఎలివేట్ చేసుకునో ఏ పని చేయకుండా తప్పించుకొని తిరగడానికి ట్రై చేస్తున్నాడు.
