Bigg Boss Elimination : బిగ్ బాస్ చరిత్రలోనే షాక్.. అప్పుడే ఇద్దరు ఎలిమినేట్.. ఇవాళ ఎవరు వెళ్లిపోయారంటే.. బిగ్ బాస్ 10 ‘డే 5’ ఫుల్ ఎపిసోడ్..
Bigg Boss 10 Telugu Day 5 Episode Eviction: ఇవాళ రెడ్, బ్లూ టీమ్స్ రద్దు చేసేసాడు బిగ్ బాస్. (Chaitra Rai Elimination)
- Saketh U
- Updated on- September 12, 2026 / 10:28 AM IST
Bigg Boss 10 Telugu Day 5 Full Episode Chaitra Rai Elimination Mid Week
Bigg Boss 10 Telugu Day 5 Elimination : మొదటి ఎలిమినేషన్ లో భాగంగా చరణ్ నిన్న హౌస్ నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. చరణ్ వెళ్లిపోవడంతో రామ్ ప్రసాద్ హై రిస్క్ నుంచి తప్పించుకున్నాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్ లో రోహిత్ సెలబ్రిటీలను కాకా పట్టడానికి దేబ్జానీతో పులిహార కలపడం మొదలుపెట్టాడు. అలాగే త్రిగున్ మీద తన టీమ్ దగ్గర నెగిటివ్ స్ప్రెడ్ చేసాడు. అలాగే ఝాన్సీ మన టీమ్ కాదు అని మిగిలిన అగ్నిపరీక్ష టీమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇక షాలిని కూడా రోహిత్ తో కలిసి సెలబ్రిటీల మైండ్ చెడగొట్టడానికి, వాళ్ళతో పులిహార కలపడానికి బాగా ట్రై చేసారు.
నిన్న రోహిత్, వంశీ హౌస్ మేట్స్ అయ్యారు. ఇవాళ రెడ్, బ్లూ టీమ్స్ రద్దు చేసేసాడు బిగ్ బాస్. దాంతో అందరూ సింగిల్ గా గేమ్ ఆడాల్సిందే. బిగ్ బాస్ 9 మందిని మీరే సెలెక్ట్ చేసుకొని చెప్పండి అంటే వర్షిణి , సుధీర్ – హార్డ్ టాస్క్, రామ్ ప్రసాద్, ఝాన్సీ, దేబ్జానీ, నరేష్, సృష్టి, అమన్, షాలిని ఈజీ టాస్క్ ఆడటానికి ముందుకొచ్చారు.
Also See – The Paradise : ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ ప్రెస్ మీట్.. నాని పవర్ ఫుల్ లుక్స్..
ఈజీ టాస్క్ వాళ్లకు రన్ రాజా రన్ టాస్క్ పెట్టారు. దీంట్లో రామ్ ప్రసాద్ గెలిచాడు. దాంతో రామ్ ప్రసాద్ హౌస్ మెట్ అయ్యాడు. బిగ్ బాస్ రామ్ ప్రసాద్ ఈజీ టాస్క్ లో ఆడిన వాళ్లలో ఒకర్ని హై రిస్క్ లో పెట్టమని చెప్పడంతో అమన్ ని హై రిస్క్ లో పెట్టాడు. అమన్ హై రిస్క్ లో ఉండటంతో సెలబ్రిటీలు బ్యాచ్ కూడా అమన్ కి రోహిత్ పై నెగిటివ్ గా చెప్పడం మొదలుపెట్టారు. అమన్ కి హై రిస్క్ ఇచ్చినందుకు రోహిత్ రామ్ ప్రసాద్ తో డిస్కషన్ పెట్టాడు. ఆ తర్వాత రోహిత్ – అమన్ మధ్య గొడవ అయింది.
ఇక హార్డ్ టాస్క్ కోసం వర్షిణి, సుధీర్ లను బిగ్ బాస్ పిలిచారు. వీళ్లిద్దరికీ ఒక కేక్ గేమ్ పెట్టారు. వీళ్ళిద్దరూ వెళ్లి హౌస్ మేట్స్ ని కేక్ తాము పాడు చేయలేదు అని నమ్మించాలి. ఎవరు ఎక్కువ మందిని నమ్మిస్తే వాళ్ళు హౌస్ మెట్ అవుతారు. కానీ గేమ్ లో ఫెయిల్ అవ్వడంతో ఇద్దర్ని హై రిస్క్ లో పెట్టారు.
Also See – Pawan Kalyan : పంచెకట్టులో పవన్ కళ్యాణ్.. కేరళ ఆలయంలో పూజలు..
చివరకు హై రిస్క్ లో ఉన్న చైత్ర, అమన్, సుధీర్, వర్షిణి లను గార్డెన్ ఏరియాలోకి పిలిచారు. మీలో మీరే ఒక పేరు చెప్పండి ఎవర్ని బయటకు పంపాలో అని బిగ్ బాస్ అడగడంతో వర్షిణి, అమన్, సుధీర్ ముగ్గురూ కలిసి చైత్ర పేరు చెప్పారు. దీంతో చైత్ర నేడు ఎలిమినేట్ అయింది. చైత్ర వెళ్ళేటప్పుడు ఇప్పటివరకు ఏ ఆడపిల్ల కప్ గెలవలేదు నువ్వు గెలవాలని వర్షిణికి చెప్పింది. అసలు మొదటి వారంకూడా పూర్తి కాలేదు, వీకెండ్ కూడా రాలేదు. అప్పుడే ఇద్దర్ని ఎలిమినేట్ చేయడంతో హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. మున్ముందు బిగ్ బాస్ ఇంకెన్ని షాక్ లు ఇస్తాడో చూడాలి..
