బిగ్ బాస్ 3: బెస్ట్ ఎంటర్టైనర్ గా వరుణ్
- veegam team
- Published on- October 29, 2019 / 04:26 AM IST
బిగ్ బాస్ సీజన్ 3కి మరో ఐదు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో ఒకరు విజేత అవుతారు. అది ఎవరనే దానిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లోకి ప్రముఖ యాంకర్ సుమ అడుగుపెట్టారు. సుమ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల జల్లులే. చిన్నపిల్లల నుంచి ముసలోళ్లదాకా ఆమె పేరు తెలియని వారుండరు. అయితే మరి ఇంటి సభ్యులతో కలిసి సుమ ఎంత అల్లరి చేసిందో చూద్దామా?
సుమ ఇంట్లోకి వెళ్లగానే బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ ఏరియా అన్నింటి పై ఓ లుక్కేసింది. దీపావళి విశేషాల గురించి అడిగింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో కలిసి ఫన్నీ టాస్క్ ఆడింది. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు హెడ్ ఫోన్స్ ధరించి ఒకరి తరవాత ఒకరు ఆ హెడ్‌ఫోన్స్‌లో మ్యూజిక్ ప్లే అవుతున్న సమయంలో సుమ చదివి వినిపించిన మాటలను కరక్ట్ గా చెప్పాలి. ఈ టాస్క్‌లో గెలిచిన వారు బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలుస్తారు. తర్వాత గెలిచినవారు తమ ఫ్యాన్స్ తో ఫోన్ కాల్ మాట్లాడే అవకాశాన్ని గెలుచుకుంటారని బిగ్ బాస్ వెల్లడించారు.
ఈ టాస్క్‌లో వరుణ్ అందరినీ తెగ నవ్వించాడు. దీంతో అతనిని బెస్ట్ ఎంటర్టైనర్ గా సెలక్ట్ చేసింది సుమ. ఇక నేటి ఎపిసోడ్ లోను సుమ సందడి కొనసాగనుండగా, ఇంటి సభ్యులతో కలిసి ఆమె సరదాగా టపాసులు కూడా కాల్చనున్నారు.
