Bigg Boss 5 Telugu: గ్రాండ్ ఫినాలే.. ఈ సీజన్‌లో డబ్బు తీసుకొని తప్పుకొనేదెవరు?
బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. మరో 24 గంటలలో ఈ సీజన్ విన్నర్ ఎవరో కౌంట్ డౌన్ మొదలు కానుంది. ఆదివారం ఈ సీజన్ ఫినాలే జరగనుండగా ఈ సీజన్ విన్నర్ ఎవరు.. రూ.50 లక్షల ప్రైజ్..
- Naresh Mannam
- Published On : December 18, 2021 / 07:39 PM IST
Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. మరో 24 గంటలలో ఈ సీజన్ విన్నర్ ఎవరో కౌంట్ డౌన్ మొదలు కానుంది. ఆదివారం ఈ సీజన్ ఫినాలే జరగనుండగా ఈ సీజన్ విన్నర్ ఎవరు.. రూ.50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకొనే కంటెస్టెంట్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సీజన్ టైలర్ విన్నర్ ఇతనే అంటే ఓ ముగ్గురు కంటెస్టెంట్లకు అభిమానులు గ్రూపులుగా ఏర్పడి తమ ఫెవరెట్ కంటెస్టెంట్ కు ఓటేసి గెలిపించాలని వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్ ఫైనల్స్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే.
Sony Charishta: ఓరచూపుల భారీ అందాలు ఈ నేపాలీ బ్యూటీ సొంతం!
ఐదుగురు కంటెస్టెంట్లలో సిరి వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్ గా ఫైనల్స్ కు చేరుకుంటే.. సన్నీ ఈ సీజన్ మొదలైన దగ్గర నుండి మెల్లగా పికప్ అవుతూ చివరికి టైటిల్ ఫెవరెట్ గా నిలవడం విశేషం. ఇక మానస్ ఊహించని విధంగా ఫైనల్స్ కు చేరుకుంటే శ్రీరామ్ తొలి నుండి సెటిల్డ్ గా గేమ్ ఆడుతూ ఇక్కడ వరకు వచ్చాడు. షణ్ముఖ్ తొలి నుండి ఫైనల్స్ లో ఉంటాడనే టాక్ సొంతం చేసుకోగా ఇప్పుడు టైటిల్ ఎవరిదన్నది ఉత్కంఠ రేపుతోంది. ఉన్న ఐదుగురిలో సిరి, మానస్ మినహా శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ పేర్లు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని బలంగా వినిపిస్తుంది.
RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. ప్రీ బుకింగ్ రికార్డులు!
దీంతో ఈ సీజన్ లో డబ్బు తీసుకొని తప్పుకునే కంటెస్టెంట్ ఎవరంటూ చర్చలు సాగుతున్నాయి. నాలుగో సీజన్‌లో బిగ్‌బాస్ రూ.50 లక్షల ప్రైజ్‌మనీలో నుంచి పాతిక లక్షలను ఆఫర్ చేయగా సోహైల్ ఆ డబ్బును స్వీకరించి స్వతాహాగా టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు సీజన్లలో ఏ కంటెస్టెంట్ ఇలా డ్రాప్ అవకపోగా సోహైల్ ఆ ట్రెండ్‌ను మార్చేశాడు. మరి ఈ సీజన్‌లో ఇలా డబ్బు తీసుకొని ఎవరు స్వతాహాగా ఎలిమినేట్ అవుతారనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.
Star Heroins Business: బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకుంటున్న స్టార్ బ్యూటీస్!
అయితే, అసలు ఈ సీజన్ లో అలంటి ఆఫర్ ఇస్తారా లేదన్న చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు అలాంటి ఆఫర్ ఇస్తే ఫైనల్స్ లో ఉండే ఐదుగురిలో సిరి ఆ డబ్బు తీసుకొని డ్రాప్ కావడం ఖాయం. షణ్ముఖ్ గెలిస్తే చాలని చెప్తూ తాను గెలవడం కష్టమని ఎప్పుడో సిరి ఫిక్సయింది కనుక డ్రాప్ అవుతుంది. అందుకే బిగ్ బాస్ ఇప్పుడు ఆ మనీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఐదుగురిలో ఇద్దరి ఎలిమినేషన్ తర్వాత ఒకేవేళ అలాంటి ఆఫర్ ఇస్తే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీలలో డబ్బుతో ఎవరైనా డ్రాప్ అవుతారా? లేక ఫైనల్స్ లో విజేతగా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది.
