Bigg Boss 6 Day 26 : ఈ వారం కొత్త కెప్టెన్.. వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసా.. అస్సలు ఊహించరు..
కెప్టెన్సీ టాస్క్ పూర్తయి కొత్త కెప్టెన్ ఎన్నికయ్యారు. అలాగే వరస్ట్ పర్ఫార్మర్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో చివరి వరకు..............
- Saketh U
- Published On : October 1, 2022 / 07:04 AM IST
Bigg Boss 6 Day 26 new captain in house
Bigg Boss 6 Day 26 : బిగ్‌బాస్ సీజన్ 6 రోజు రోజుకి కొత్తగా మార్చడానికి ట్రై చేస్తున్నారు నిర్వాహకులు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ పూర్తయి కొత్త కెప్టెన్ ఎన్నికయ్యారు. అలాగే వరస్ట్ పర్ఫార్మర్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో చివరి వరకు సుదీప, కీర్తి, శ్రీ సత్యలు వచ్చారు. వీరి ముగ్గురి మధ్య చివరి కెప్టెన్సీ టాస్ నడిచింది.
చివరి టాస్క్ లో కెప్టెన్ అనే ఇంగ్లీష్ లెటర్స్ ని ఒక్కొక్కటి తీసుకువచ్చి హుక్స్ కి తగిలించాలి. అయితే వీటిని తెచ్చే సమయంలో బిగ్‌బాస్ రెండు ఫుట్ పాత్స్ ఇచ్చాడు. వాటిని జరుపుకుంటూ వాటి మీదే నడవాలి. ఈ టాస్క్ లో అందరి కంటే ముందు కీర్తి కంప్లీట్ చేసి ఈ వారం కెప్టెన్ గా ఎన్నికయింది.
The Ghost: ది ఘోస్ట్ రిలీజ్ ట్రైలర్.. యాక్షన్‌తో దుమ్ములేపిన కింగ్!
ఇక కెప్టెన్సీ టాస్క్ తర్వాత ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ని ఎన్నుకోమన్నారు. దీంట్లో ఒక్కో కంటెస్టెంట్ ఎవరు వరస్ట్ పర్ఫార్మర్ అనుకుంటారో వాళ్ళ పేరుని పేపర్ మీద రాసి వోట్ బాక్స్ లో వేయాలి. ఇందులో ఎక్కువగా అర్జున్ కళ్యాణ్ కి ఓట్లు పడ్డాయి. అర్జున్ ఎక్కువగా శ్రీ సత్య కోసం ఆడుతున్నాడు అంటూ అందరూ అర్జున్ ని వరస్ట్ పర్ఫార్మర్ అన్నారు. దీంతో ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ గా అర్జున్ ఎంపికవ్వడంతో అతన్ని జైల్లో పెట్టారు.
ఇక గొడవలు కూడా మామూలే అన్నట్టు నిన్న కూడా ఆదిరెడ్డి, రేవంత్ మధ్య, ఫైమా, రాజ్ మధ్య కూడా గొడవలు జరిగాయి. మరి ఇవాళ్టి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
