Bigg Boss 7 Day 99 : చివరి వారం.. ఎమోషనల్ జర్నీలే.. అమర్, అర్జున్ బిగ్‌బాస్ జర్నీ..
నిన్న సోమవారం ఎపిసోడ్ లో ఎపిసోడ్ అంతా అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్‌బాస్.
- Saketh U
- Published On : December 12, 2023 / 07:25 AM IST
Bigg Boss 7 Day 99 Highlights Bigg Boss Show Arjun and Amardeep Emotional Journey
Bigg Boss 7 Day 99 : బిగ్‌బాస్ 14 వారాలు పూర్తయింది. ప్రస్తుతం చివరివారం నడుస్తుంది. ఫైనల్ లోకి అమర్ దీప్, అర్జున్, ప్రియాంక, శివాజీ, ప్రశాంత్, యావర్ లు వచ్చారు. వీరిలో ఎవరు కప్పు కొడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక చివరి వారం నామినేషన్స్, ఫైట్స్, గేమ్స్, టాస్కులు లేకుండా ఎమోషనల్ గా సాగబోతుందని తెలుస్తుంది.
నిన్న సోమవారం ఎపిసోడ్ లో ఎపిసోడ్ అంతా అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్‌బాస్. మొదట అమర్ దీప్ లాన్ లోకి రాగా అక్కడ అంతా అందంగా అలంకరించి, అమర్ ఫొటోలతో డిజైన్ చేసి చూపించారు. ఇది చూసి అమర్ దీప్ ఆశ్చర్యపోయాడు. అక్కడ అంతా తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత అమర్ దీప్ జర్నీని ఓ వీడియో రూపంలో 16 నిమిషాల పాటు చూపించారు. ఇది చూసి అమర్ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Bigg Boss 7 : నాగార్జున స్వెటర్ అడిగిన అమర్‌దీప్.. దాని ధర తెలిస్తే షాక్ అవుతారు..
అమర్ దీప్ తర్వాత అర్జున్ లాన్ లోకి వచ్చాడు. అర్జున్ కి చెందిన ఫొటోలతో అందంగా డిజైన్ చేయగా అర్జున్ అది చూసి సంతోషం వ్యక్తం చేశాడు. అనంతరం అర్జున్ జర్నీని కూడా వీడియో రూపంలో చూపించాడు బిగ్‌బాస్. దీంతో అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ అంతా ఈ ఇద్దరి జర్నీలు చూపించడంతోనే సాగిపోయింది. ఇంకా నలుగురు మిగిలి ఉండటంతో నేడు, రేపు కూడా అందరివి ఎమోషనల్ గా బిగ్‌బాస్ జర్నీలు చూపిస్తారని తెలుస్తుంది.
