Bigg Boss 7 Telugu Elimination : ఈ వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేషన్..!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. 13వ వారం పూర్తి కావొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : December 2, 2023 / 09:54 PM IST
Bigg Boss 7 Elimination
Bigg Boss 7 Elimination : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. 13వ వారం పూర్తి కావొచ్చింది. ఈ వారం ఏడుగురు ప్రశాంత్, యావర్, శివాజీ, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అంబటి అర్జున్ ఫినాలే అస్త్ర గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అతడు టాప్-5లో ఉంటాడు కాబట్టి అతడు ఎలిమినేట్ కావడం అనేది కాస్త కష్టమే.
శనివారం అతడిని మొదటి ఫైనలిస్టుగా ప్రకటిస్తూ నాగార్జున అతడిని సేవ్ చేశాడు. ఈ వారం ఖచ్చితంగా శోభాశెట్టి ఎలిమినేట్ కానుందని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అనుకున్నట్లుగానే ఈ వారం డేంజర్ జోన్‌లో ఆమె ఉందట. ఆమెతో పాటు గౌతమ్ కూడా ఉన్నట్లు టాక్. మిగిలిన వారు సేవ్ కాగా.. వీరిద్దరికి తక్కువ ఓట్లు వచ్చాయట. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు.
Sheela Rajkumar : విడాకులు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తాడా..?
రైతు బిడ్డ ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. దీని ద్వారా అతడు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు. మరీ గౌతమ్ కోసం అతడు ఎవిక్షన్ పాస్ ఉపయోగించాడా..? లేదా..? అన్నది తెలియలేదు. ఒకవేళ అతడు ఎవిక్షన్ పాస్ గనుక గౌతమ్ కోసం ఉపయోగిస్తే అతడు సేవ్ అయినట్లే. అయితే.. గౌతమ్‌ను ప్రశాంతే నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. నామినేట్ చేసిన గౌతమ్‌ను ప్రశాంత్ సేవ్ చేయాలని అనుకుంటాడా..? అన్నది పెద్ద ప్రశ్నే. అసలు ఏం జరిగింది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయకతప్పదు.
