Prince Yawar: హనీట్రాప్ లో బిగ్ బాస్ ఫేమ్ యావర్.. రూ.23 లక్షలు గోవిందా!

హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్న బిగ్ బాస్ సీజన్ 7 ప్రిన్స్ యావర్(Prince Yawar).

Bigg Boss fame Prince Yawar embroiled in honey trap controversy.

Prince Yawar: బిగ్‌బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలికి చెందిన నవాజ్ అనే బిల్డర్ తనను మోసం చేశాడని, తిరిగి డబ్బులు అడిగితే తన కుమార్తెతో ‘హనీ ట్రాప్’ చేయించి ఇరికించాడని సంచలన ఆరోపణలు చేశాడు యావర్. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను నమ్మించి మోసం చేసిన సదరు బిల్డర్‌పై న్యాయం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు యావర్.

Shruti Haasan: వంటల వీడియోలు, క్రింజ్ రీల్స్.. తండ్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన శృతి

అసలు ఎం జరిగింది అంటే, బిల్డర్ నవాజ్ మొదట తన కుమార్తెతో నిశ్చితార్థం చేస్తానని నమ్మబలికి యావర్‌(Prince Yawar)కు దగ్గరయ్యాడు. ఆ నమ్మకంతోనే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో యావర్ నుంచి సుమారు రూ. 23 లక్షలు వసూలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మొత్తానికి బదులుగా రూ.40 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. అయితే, గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, యావర్ ఒత్తిడి చేయడంతో నవాజ్ బెదిరింపులకు దిగాడు. దీంతో యావర్ చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే? యావర్‌కు ఇవ్వాల్సిన డబ్బుల నుంచి తప్పించుకోవడానికి నవాజ్ తన కుమార్తెను అడ్డం పెట్టుకుని ‘హనీ ట్రాప్’ ప్లాన్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో యావర్‌పై తప్పుడు కేసు పెట్టించినట్లు తెలుస్తోంది. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్‌తో తనను ఇరికించారని యావర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన పోలీస్ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.