Shiva Jyothi: యాంకర్ శివజ్యోతి కూతురి నామకరణ వేడుక.. గారాల పట్టికి ఏం పేరు ఏంటో తెలుసా?

యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి(Shiva Jyothi) కుమార్తె నామకరణోత్సవ వేడుక.

Bigg Boss Fame Shiva Jyothi Daughter Naming Ceremony event

  • శివజ్యోతి కూతురి నామకరణ వేడుక సందడి.
  • పాపకు ‘వెన్నెల’ అని నామకరణం.
  • వేడుకలో మెరిసిన బుల్లితెర సెలబ్రిటీలు.

Shiva Jyothi: ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి(Shiva Jyothi) తన జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె, తన మాతృత్వపు మధురిమలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా తన గారాల పట్టి కోసం ఘనంగా నామకరణ వేడుకను నిర్వహించి, ఆ చిన్నారికి ‘వెన్నెల’ అని నామకరణం చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మా వెన్నెల చుట్టాలు” అంటూ మురిసిపోయారు. తమ ఇంటి మహాలక్ష్మికి పేరు పెట్టిన ఈ సందర్భం శివజ్యోతి దంపతులకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.

Actress Sireesha: తెలుగు సీరియల్ నటి శిరీష గుర్తుందా.. ఎంత ట్రెండీగా మారిపోయిందో చూడండి.. ఫొటోలు

ఈ సందడికి బుల్లితెర సెలబ్రిటీలు, సినీ తారలు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలో శివజ్యోతి, గంగులు దంపతులు తమ చిన్నారి వెన్నెలతో కలిసి ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రస్తుతం ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన యాంకర్ తల్లిగా ప్రమోషన్ పొందడం, పాపకు ఎంతో అర్థవంతమైన పేరు పెట్టడం చూసి నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ ఏడాది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే స్పెషల్ ఇయర్ అని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.