Bigg Boss Shalini : మళ్ళీ తిట్టిన బిగ్ బాస్.. ఎవరెన్ని చెప్పినా, తిట్టినా మారని షాలిని.. సీక్రెట్ రూమ్ కి పంపినా నో ఛేంజ్..
షాలినిపై ప్రేక్షకులు, ఇంట్లో సభ్యులు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, నాగార్జున, బిగ్ బాస్ అందరూ ఫైర్ అయ్యారు. నాగార్జున డైరెక్ట్ గానే తిట్టారు. (Bigg Boss Shalini)
- Saketh U
- Updated on- October 23, 2026 / 01:23 PM IST
Bigg Boss Shalini
Bigg Boss Shalini : ఎప్పుడో రెండు వారాల క్రితం ఎలిమినేట్ అవ్వాల్సిన షాలినిని ఇంకా బిగ్ బాస్ లో ఉంచుతున్నారు. అక్కడ ఏం లేకపోయినా అవతలి వాళ్ళ మీద అరుస్తూనే ఉంటుంది షాలిని. ఏదైనా గొడవ అయిందంటే మాట్లాడటం కంటే అరుపులు ఎక్కువ ఉంటాయి. వాయిస్ పెంచి అరిస్తే మనల్ని ఎవరు ఏం చేయలేరు అనే భావనలో షాలిని ఉంటుంది. పైగా బూతులు, హౌస్ లో మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతుంది.
ఈ విషయంలో షాలినిపై ప్రేక్షకులు, ఇంట్లో సభ్యులు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, నాగార్జున, బిగ్ బాస్ అందరూ ఫైర్ అయ్యారు. నాగార్జున డైరెక్ట్ గానే తిట్టారు. అయినా మారలేదు. ఎన్ని సార్లు చెప్పినా మారట్లేదు షాలిని. గత వారం ఎలిమినేషన్ అని చెప్పి సీక్రెట్ రూమ్ కి మారిస్తే ఏమైనా మారుతుంది అనుకున్నారు కానీ నో ఛేంజ్. మళ్ళీ నిన్న టాస్కుల్లో అరవడం, ఇష్టమొచ్చిన పదాలు మాట్లాడటం చేసింది షాలిని.
Also Read : Prakeerthi : అన్నయ్య పుట్టిన రోజు.. ప్రభాస్తో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన చెల్లి..
దీంతో బిగ్ బాస్ షాలినిని పిలిచి.. ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా చెప్పినా మీకు అర్ధం కాకపోవడం మీపై మీకు అసలు కంట్రోల్ లేదనే విషయం తెలుస్తుంది. షోలో మాట్లాడకూడని విషయాలు మీకు మాట్లాడాలని ఉంది కాబట్టి కెమెరాను చూస్తూ ఇప్పుడే అన్ని మాట్లాడేయండి. అవి ఏంటో నేను, ఇంట్లోని సభ్యులోను, ప్రేక్షకులు తెలుసుకుంటారు అని కోప్పడ్డారు. దీంతో ఎప్పట్లాగే ఓ సారీ చెప్పి దులిపేసుకుందామని సారీ చెప్పింది.
బిగ్ బాస్ స్వయంగా తిట్టినా, నాగార్జున ఫైర్ అయినా, ఆఖరికి ప్రేక్షకులు చెప్పినా షాలిని లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రోహిత్ తో లవ్ ట్రాక్, పక్కనోళ్ళ మీద అరవడం తప్ప షాలిని నుంచి ఏ గేమ్ కనపడట్లేదు. అయినా ఇంకా ఆమెను ఎందుకు హౌస్ లో ఉంచుతున్నారో బిగ్ బాస్ కే తెలియాలి. బయట మాత్రం రోహిత్ – షాలిని పిఆర్ టీమ్ కలిసి ఫేక్ ఓట్లు, డబ్బులిచ్చి ప్రమోషన్స్ తో సర్వైవ్ అవుతున్నారని సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. ఈ వారం మళ్ళీ నాగార్జునతో షాలిని తిట్టించుకుంటుందని భావిస్తున్నారు అంతా. అయినా ఆమె మారదు అనే ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు.
