Bigg Boss Kannada Season 10 starting soon with Kichcha Sudeepa Hosting Free streaming in Jio Cinemas
Bigg Boss Kannada : బిగ్‌బాస్ రియాల్టీ షో దేశంలోని అన్ని పలు భాషల్లో ప్రతి సంవత్సరం సీజన్లు సీజన్లు సాగుతూనే ఉంది. ఇటీవలే తెలుగులో కూడా నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్ సీజన్ 7 మొదలైంది. ఇప్పటికే మొదటి వారం పూర్తయి రెండో వారం మరింత రసవత్తరంగా సాగుతుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 పూర్తయింది. ఇప్పుడు కన్నడలో బిగ్‌బాస్ మొదలవ్వబోతుంది.
కన్నడలో ఇప్పటికే బిగ్‌బాస్ షో 9 సీజన్లు పూర్తి చేసుకొని త్వరలో పదవ సీజన్ మొదలవ్వనుంది. గత తొమ్మిది సీజన్లుగా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ బిగ్‌బాస్ కన్నడకు హోస్ట్ చేస్తున్నారు. ఈ సారి మొదట రిలీజ్ చేసిన ప్రోమోలో సుదీప్ లేకపోవడంతో ఈ సారి హోస్ట్ మారతాడేమో అని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బిగ్‌బాస్ కన్నడ సీజన్ 10 ప్రోమో రిలీజయింది. ఇందులో సుదీప్ హ్యాపీ బిగ్‌బాస్ అంటూ అదరగొట్టారు. దీంతో ఈ సారి కూడా సుదీప్ హోస్ట్ చేయనున్నట్టు క్లారిటీ వచ్చేసింది. త్వరలో బిగ్‌బాస్ 100 రోజుల పండగ మొదలవ్వబోతుంది అంటూ ఈ ప్రోమో సాగింది.
Keedaa Cola : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. కీడా కోలా వచ్చేది ఎప్పుడంటే?
కన్నడ బిగ్‌బాస్ కలర్స్ కన్నడ ఛానల్ లో చూడొచ్చు. అలాగే జియో సినిమాస్ ఓటీటీలో ఫ్రీగా కూడా చూడొచ్చు. త్వరలోనే కన్నడ బిగ్‌బాస్ సీజన్ 10 గ్రాండ్ గా మొదలవ్వనుంది.