Bigg Boss Love Track : బిగ్ బాస్‌లో మొదలైన లవ్ ట్రాక్.. ఆ కంటెస్టెంట్ తో ఫ్లర్టింగ్ చేస్తున్న సుధీర్ రెడ్డి..

ఈ సారి లవ్ ట్రాక్స్ ఎవరి మధ్య నడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. (Bigg Boss Love Track)

  • Published on- September 8, 2026 / 03:26 PM IST

Bigg Boss Love Track

Bigg Boss Love Track : బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండు రోజుల క్రితమే మొదలయిన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్ లో గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవడాలు, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ తో పాటు లవ్ ట్రాక్స్ కూడా ఉంటాయని తెలిసిందే. ఎవరో ఒక జంట క్లోజ్ గా ఉండి ప్రతి సీజన్ లో వైరల్ అవుతారు. ప్రతి సీజన్ లో వైరల్ అయిన జంటలు చాలానే ఉన్నాయి. దీంతో ఈ సారి లవ్ ట్రాక్స్ ఎవరి మధ్య నడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్.

బిగ్ బాస్ ఓపెనింగ్ రోజు అగ్నిపరీక్ష నుంచి వచ్చిన అమన్ మసూద్ – షాలిని పటేల్ మధ్య లవ్ ట్రాక్ ఉండొచ్చు అనేలా నాగార్జున డైలాగ్స్ వేశారు. దీంతో హౌస్ లో వీళ్ళు ఒక జంట అవుతారేమో అని అనుకున్నారు. అయితే హౌస్ లోకి వెళ్ళాక మొదటి లవ్ ట్రాక్ సుధీర్ రెడ్డి – సృష్టి మధ్యలో నడుస్తుంది.

Also Read : Bigg Boss 10 Today Day 1 : బిగ్ బాస్ 10 ‘డే 1’ ఫుల్ ఎపిసోడ్.. ఇద్దరు లీడర్స్ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్.. పవర్ బాక్స్ లో ఏమున్నాయి..

నిన్నటి ఎపిసోడ్ లో యాంకర్ సుధీర్ రెడ్డి – మోడల్ సృష్టి ని తెగ ఫ్లర్టింగ్ చేశాడు. ఆమె వెనకే తిరగడం, ఆమెతో మాట్లాడుతూ కూర్చోవడం, ఆమె టాటూ మీద డైలాగ్స్ వేయడం, ఆమెని నవ్వించడం.. ఇలా బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు సృష్టి చుట్టూ తిరుగుతున్నాడు సుధీర్. సృష్టి కూడా ఈ ఫ్లర్టింగ్ ని బాగానే ఎంజాయ్ చేస్తుంది. మరి సుధీర్ రెడ్డి -సృష్టి లవ్ ట్రాక్ కంటిన్యూ అవుతుందా లేక ముందుముందు ఈ జంటకు బిగ్ బాస్ బ్రేకులు వేస్తాడా చూడాలి.