Thrigu Bigg Boss Nominations : చప్పగా సాగిన నామినేషన్స్.. ఏడ్చేసిన వర్షిణి, ఝాన్సీ.. ఇంకా మారని రోహిత్.. బిగ్ బాస్ 10 డే 50 ఎపిసోడ్..
గ్రీన్ వాళ్లకు ఎలాగో రెండు వారాలు నామినేషన్స్ నుంచి సేఫ్ వచ్చింది. (Thrigun Bigg Boss Nominations)
- Saketh U
- Updated on- October 27, 2026 / 10:30 AM IST
Bigg Boss Nominations Day Bigg Boss Telugu 10 Day 50 Episode
Bigg Boss Nominations Day 50: నిన్న ఆదివారం సరదాగా సాగిపోయింది. ఎలిమినేషన్స్ తో ఎమోషనల్ అయింది. నిన్న రాత్రి ముకేశ్ – దేబ్జానీ ఫుడ్ విషయంలో గొడవ పడ్డారు. అదే విషయంలో శివ – ముకేశ్ గొడవ పడ్డారు. ఈ గొడవ గురించి దేబ్జానీ, రేషన్ మేనేజర్ నీతూ నటరాజ్.. త్రిగున్ తో చర్చ పెట్టారు. షాలిని వెళ్లిపోవడంతో ఆమె బెడ్ రోహిత్, అమన్ తీసుకోడానికి ట్రై చేసారు. దీని కోసం నరేష్ మధ్యవర్తిత్వం చేసాడు దేబ్జానీతో. వాష్ రూమ్ లో ర్యాక్స్ గురించి డిస్కషన్ మొదలయింది. ఈ విషయంలో శివ – ముకేశ్ గొడవ పెట్టుకున్నారు. శివ, రామకృష్ణలకు కావాల్సిన ర్యాక్స్ కోసం ముకేశ్ తో గొడవ జరిగింది. ముకేశ్ మారిన విధానం గురించి దేబ్జానీ, శివ, శ్వేతా డిస్కషన్ పెట్టుకున్నారు.
నామినేషన్స్ ప్రారంభం అయ్యే ముందు గోట్ నుంచి అల్టిమేట్ గోట్ టాస్క్ ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. ఎల్లో, రెడ్ లెవల్ లో ఉన్న సభ్యుల భవిష్యత్ గ్రీన్ లో ఉన్న గోట్స్ డిసైడ్ చేస్తారు అని చెప్పారు. మొదటి రౌండ్ లో ఎల్లో, రెడ్ లో ఉన్నవాళ్లను గ్రీన్ వాళ్ళు నామినేట్ చేయాలి. గ్రీన్ వాళ్లకు ఎలాగో రెండు వారాలు నామినేషన్స్ నుంచి సేఫ్ వచ్చింది. త్రిగున్, అమన్, దేబ్జానీ, నీతూ, ముకేశ్ గ్రీన్ లో గోట్స్ గా ఉన్నారు.
Also Read – Sujeeth : ‘బ్లడీ రోమియో’తో బిజీ అయిన సుజీత్.. ఇదయ్యాకే పవన్ కళ్యాణ్ సినిమా..
గ్రీన్ లో ఉన్నవాళ్లు ఒక్కొక్కరు మూడు వరకు నామినేషన్స్ చేసుకోవచ్చు. మొదట ఎవరు ఎంతమందిని నామినేట్ చేస్తారు అనేది డిసైడ్ అవ్వాలి. తర్వాత స్లిప్ మీద రాయాలి. తర్వాత ఎవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పి చేయాలి. గోట్స్ అంతా ఒక్కర్నే నామినేట్ చేస్తామని చెప్పినా త్రిగున్ మూడు నామినేషన్స్ చేస్తానని తెలిపాడు.
నీతూ మొదట – ఝాన్సీ ని నామినేట్ చేసింది. త్రిగున్ – మొదట రామ్ ప్రసాద్ ని నామినేట్ చేసాడు. కెప్టెన్సీ సరిగ్గా చేయలేదు అని. మొదటి సారి ఒక నామినేషన్ ఎలాంటి గొడవ లేకుండా హ్యాపీగా సింపుల్ గా సాగింది. ముకేశ్ – రామకృష్ణ ని నామినేట్ చేయగా గొడవ పెట్టుకున్నారు. ముకేశ్ రామకృష్ణని మూర్ఖుడు అన్నాడు. త్రిగున్ రెండో నామినేషన్ రోహిత్ ని నామినేట్ చేసాడు. ఆయన చేసే విషయాలు అని చెప్పాడు త్రిగున్. చెప్తుంటే రోహిత్ ఎగతాళిగా నవ్వుతున్నాడు ఎగతాళిగా. రోహిత్ బిహేవియర్ బాగోలేదని అందరూ చెప్పినా, హౌస్ లో కనిపించినా, హోస్ట్ నాగార్జున పనిషమెంట్స్ ఇచ్చినా ఏమి మారలేదు అని తెలుస్తుంది. కాకపోతే షాలిని వెళ్ళిపోయినందుకు బాధలో ఉన్నాడు. రోహిత్ త్రిగున్ ని మూర్ఖుడు అని తిట్టి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడాడు రోహిత్. ఈ వారం కూడా నాగ్ తో తిట్టించుకునేలానే ఉన్నాడు రోహిత్.
Also Read – Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపు..
ఇక దేబ్జానీ – ఝాన్సీని నామినేట్ చేసింది. ఝాన్సీ నువ్వు నాకు క్లోజ్ కాదు అని చెప్పిన దాని గురించి ఇద్దరి మధయ్ గొడవ జరిగింది. ఝాన్సీ మేకప్ విషయంలో హెల్ప్ కోసం దేబ్జానీ దగ్గరకు వెళ్లగా దాన్ని కూడా దేబ్జానీ నెగిటివ్ చేసిందని ఏడ్చింది ఝాన్సీ. అమన్ – సుధీర్ ని నామినేట్ చేసాడు. వీళ్ళిద్దరూ కాసేపు గొడవ పడ్డారు. సుధీర్ మాట్లాడుతున్నది వినకుండానే అమన్ వెళ్ళిపోయాడు. చివరగా త్రిగున్ – వర్షిణి ని నామినేట్ చేసాడు. ఇదెవరూ ఊహించలేదు. టాస్క్ లో ఫ్రెండ్ అయినా సపోర్ట్ చేయకుండా త్రిగున్ ఆడి గెలిచాడు. కానీ అది అర్ధం చేసుకోలేదు వర్షిణి. దీంతో వీరిద్దరి మధ్య వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చర్చ జరిగింది. దీంతో వర్షిణి కూడా ఫ్రెండ్ గా త్రిగున్ సపోర్ట్ చేయలేదని ఏడ్చింది. ఇవాళ్టికి గ్రీన్ లో ఉన్న వాళ్ళ నామినేషన్స్ అయిపోయాయి. రేపు ఇంకొన్ని నామినేషన్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవాళ నామినేషన్స్ పెద్దగా ఫైర్ లేకుండా సింపుల్ గొడవలతోనే సాగాయి.
