Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపు..
ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. (Aadarsha Kutumbam)
Aadarsha Kutumbam
Aadarsha Kutumbam : వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్టోబర్ 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.
Also Read : Virosh : విజయ్ రష్మికపై ట్రోలింగ్.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్..
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత ఎస్. రాధాకృష్ణ విజ్ఞప్తి మేరకు టికెట్ పెంపుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై 50 రూపాయలు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు పర్మిషన్స్ ఇచ్చారు. ఈ పర్మిషన్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు అనగా 10 రోజుల పాటు ఇచ్చారు.
