Elvish Yadav : యూట్యూబర్ పై బిగ్‌బాస్ విన్నర్ దాడి.. కేసు నమోదు..

తాజాగా ఎల్విష్ యాదవ్ పై గురుగ్రామ్ లో కేసు నమోదయింది.

Bigg Boss OTT 2 Winner Elvish Yadav attacked on You Tuber Sagar Thakur Case filed

Elvish Yadav : హిందీ బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ లో ఎల్విష్ యాదవ్ విన్నర్ గా నిలిచాడు. యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న ఎల్విష్ యాదవ్ ఆ తర్వాత బిగ్ బాస్ కి వచ్చి మరింత ఫేమ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లో విన్ అవ్వడంతో ఎల్విష్ యాదవ్ బాగా వైరల్ అయ్యాడు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ తో డబ్బులు కూడా బానే సంపాదించాడు. ఇక ఎల్విష్ ఆర్మీ అని కొంతమంది ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హడావిడి చేశారు.

తాజాగా ఈ ఎల్విష్ యాదవ్ పై గురుగ్రామ్ లో కేసు నమోదయింది. గత కొన్నాళ్లుగా మరో యూట్యూబర్ సాగర్ ఠాకూర్ కి, ఎల్విష్ యాదవ్ కి విబేధాలు ఉన్నాయి. సాగర్ ఠాకూర్ తన వీడియోలలో, సోషల్ మీడియాలో ఎల్విష్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసాడు. అయితే తాజాగా ఎల్విష్ యాదవ్ సాగర్ ఠాకూర్ ప్లేస్ కి కొంతమంది మనుషులతో కలిసి వెళ్లి అతనిపై దాడి చేసాడు. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Samantha : సమంత బామ్మని చూశారా? మిస్ మై గ్రాండ్ మా అంటూ పోస్ట్..

దీంతో ఎల్విష్ యాదవ్ ని అరెస్ట్ చేయమని సోషల్ మీడియాలో పలువురు ట్రెండ్ చేస్తున్నారు. గురుగ్రామ్ లో ఎల్విష్ యాదవ్ పై కేసు కూడా నమోదు అయింది. దాడికి గురైన సాగర్ కూడా తనపై ఎల్విష్ దాడి చేసాడని, చంపడానికి ప్రయత్నించాడని తెలిపాడు. అయితే ఈ విషయంలో ఎల్విష్ ని అతని అభిమానులు సపోర్ట్ చేయడం గమనార్హం. మరి ఎల్విష్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు