Samantha : సమంత బామ్మని చూశారా? మిస్ మై గ్రాండ్ మా అంటూ పోస్ట్..

సమంత బామ్మ కార్ లో కూర్చొని బయట పరిసరాలు చూస్తూ ఆశ్చర్యపోతూ ఆనందిస్తుంది. ఈ క్యూట్ వీడియోని సమంత కజిన్ షేర్ చేయగా..

Samantha : సమంత బామ్మని చూశారా? మిస్ మై గ్రాండ్ మా అంటూ పోస్ట్..

Samantha shares her Grand Mother Video and says missed her

Updated On : March 9, 2024 / 8:46 AM IST

Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన బిజినెస్ లు చూసుకుంటూ, తన హెల్త్ పై ఫోకస్ చేస్తూ, ఇటీవలే హెల్త్ పాడ్ కాస్ట్ లు మొదలుపెట్టి బిజీగా ఉంది సమంత. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది సామ్.

తాజాగా సమంత కజిన్ ఒకరు సమంత బామ్మని తన కార్ లో కూర్చోపెట్టుకొని ఊరంతా తిప్పుతూ, ఆ పెద్దావిడతో మాట్లాడుతూ, డెవలప్ అయిన ఊరిని చూసి ఆమె ఆశ్చర్యపోతున్న వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సమంత బామ్మ కార్ లో కూర్చొని బయట పరిసరాలు చూస్తూ ఆశ్చర్యపోతూ ఆనందిస్తుంది. ఈ క్యూట్ వీడియోని సమంత కజిన్ షేర్ చేయగా దీనిని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి ‘మిస్ మై గ్రాండ్ మా..’ అంటూ ఎమోషనల్ సింబల్స్ పెట్టింది.

samantha grand mother

Also Read : Sai Dharan Tej : నాగబాబు, పవన్ మామ అయిపోయారు.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి మామ..

మరి ఈ బామ్మ సమంతకు నానమ్మ అవుతుందో, అమ్మమ్మ అవుతుందో క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆమెకు దూరంగా ఉండి సమంత ఆమెని మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈవిడ సమంత బామ్మ అంటూ వీడియో వైరల్ అవుతుంది.