Sai Dharan Tej : నాగబాబు, పవన్ మామ అయిపోయారు.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి మామ..

ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేశారు, మీ ఫ్యామిలిలో రామ్ చరణ్ గారితో లేదా ఇంకెవరితోనైనా మల్టీస్టారర్ చేస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడగగా తేజ్ సమాధానమిస్తూ..

Sai Dharan Tej : నాగబాబు, పవన్ మామ అయిపోయారు.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి మామ..

Sai Dharam tej wants to act with Megastar Chiranjeevi

Updated On : March 9, 2024 / 8:21 AM IST

Sai Dharan Tej : సాయి ధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష, బ్రో సినిమాలతో మంచి విజయం సాధించాడు. తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నా హెల్త్ మీద మరింత ఫోకస్ చేయడానికి కొన్ని నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అయితే సాయి ధరమ్ తేజ్, స్వాతి కలిసి గతంలో నవీన్ దర్శకత్వంలో సత్య అనే ఓ షార్ట్ ఫిలిం చేశారు. ఆల్రెడీ సత్య షార్ట్ ఫిలిం నుంచి సాంగ్ రిలీజ్ చేసి మెప్పించారు. నిన్న ఉమెన్స్ డే సందర్భంగా ఈ షార్ట్ ఫిలిమ్ కొంతమందికి ప్రీమియర్ వేసి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఇందులో భాగంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేశారు, మీ ఫ్యామిలిలో రామ్ చరణ్ గారితో లేదా ఇంకెవరితోనైనా మల్టీస్టారర్ చేస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడగగా తేజ్ సమాధానమిస్తూ.. ఆల్రెడీ నాగబాబు, పవన్ మామలతో కలిసి నటించాను. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి(Chiranjeevi) మామ. ఆయనతో కలిసి నటించాకే మిగిలిన వాళ్ళతో కూడా అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను అని తెలిపారు.

Also Read : Renu Desai : పిల్లలతో శివరాత్రి జాగారణ చేయించిన రేణుదేశాయ్.. ఇది మన బాధ్యత అంటూ..

దీంతో సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. జవాన్ సినిమాలో నాగబాబు – తేజ్ కలిసి నటించారు. ఇక బ్రో సినిమాలో పవన్ – తేజ్ ఫుల్ లెంగ్త్ కలిసి నటించారు. నెక్స్ట్ చిరంజీవితో తేజ్ ఏ సినిమాలో కనిపిస్తాడో చూడాలి.