Bigg Boss Rohith Elimination : మొత్తానికి ఎలిమినేట్ అయిన రోహిత్.. అయినా రియాలిటీకి రాకుండా.. బిగ్ బాస్ డే 56 వీకెండ్ ఎపిసోడ్..
రోహిత్ ఎలిమినేట్ అయిపోయాడు.(Bigg Boss Rohith Elimination)
- Saketh U
- Updated on- November 1, 2026 / 10:36 PM IST
Bigg Boss Rohith Elimination
Bigg Boss Rohith Elimination : మొదట నిన్న ఎలిమినేట్ అయి ఝాన్సీ స్టేజి మీదకు వచ్చింది. ఇంత తొందరగా వెళ్ళిపోతాను అని అనుకోలేదని ఝాన్సీ చెప్పింది. నాగార్జున కూడా అదే అన్నారు. ముకేశ్ వల్లే బయటకు వచ్చేసిందని నాగ్ గుర్తు చేసినా పాపం ఏమన్లేక ముకేశ్ ని వెనకేసుకొచ్చింది. వెళ్లేముందు కొన్ని సామెతలు ఇచ్చి ఎవరికీ ఏం ఇవ్వాలో చెప్పమన్నారు.
కుక్క తోక వంకర – రోహిత్ కి ఇచ్చింది. నాగార్జున కూడా కౌంటర్ ఇచ్చి తను తప్పు చేయలేదు అని అనుకుంటాడు అని అన్నారు. ఎవరు తీసిన గోతిలో వల్లే పడతారు అనే సామెత దేబ్జానీకి ఇచ్చింది. గోరంత ఉంటె కొండంత చేస్తారు సామెత త్రిగున్ కి ఇచ్చింది. మెరిసేదంతా బంగారం కాదు సామెత ముకేశ్ కి ఇచ్చింది. ఇంట్లో పులి వీధిలో పిల్లి సామెత నరేష్ కి ఇచ్చింది. అనంతరం ఝాన్సీ బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయింది.
నాగార్జున కొంచెం గ్యాప్ ఇవ్వడంతో అందరూ మాట్లాడుకున్నారు. నిన్న త్రిగున్ ని రాత్రి పూట రోహిత్, ముకేశ్, వర్షిణి, సుధీర్ మాట్లాడుకుంటూ తిట్టిన మాటలు చూపించడంతో షాక్ అయిన సంగతి తెలిసిందే. వాటి గురించి వాళ్ళతో తప్ప త్రిగున్ అందరితో చర్చించాడు.
Also Read : Varun Tej : వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. లావణ్యతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన వరుణ్ తేజ్..
అనంతరం కంటెస్టెంట్స్ బొమ్మలు ఉన్న ఒక బోర్డు పెట్టారు. ఎవరి బొమ్మని వాళ్ళు పగలగొట్టి అందులో ఉన్న కార్డు తీయాలి. దాంట్లో ఉన్నది చదవాలి. దాంట్లో వారి గురించి నెగిటివ్స్ రాసి ఉంటాయి. అది ఇంట్లో వాళ్లే రాసారు. అది చేదు నిజం. ఎవరు రాసారో గెస్ చేస్తే కాకరకాయ లడ్డూ వాళ్లకు తినిపించాలి. గెస్ చేయకపోతే వాళ్ళే తినాలి.
మొదట త్రిగున్ తనకు రాసినావు చదివి సుధీర్ అని చెప్పాడు. కానీ వర్షిణి రాసింది. నెక్స్ట్ అమన్ – ముకేశ్ అన్నాడు కానీ రోహిత్ రాసాడు అని తెలిసి షాక్ అయ్యాడు. శ్వేతా – కి ఎవరు రాయలేదు. దాంతో ఎవరికీ నీ మీద ఒపీనియన్ లేదు ఇంప్రూవ్ అవ్వాలి అని నాగార్జున చెప్పారు. దేబ్జానీ – ముకేశ్ అని కరెక్ట్ చెప్పింది. నరేష్ – దేబ్జానీ అని కరెక్ట్ గా చెప్పింది. సుధీర్ – శివ అని చెప్పాడు కానీ అమన్ రాసాడు. నీతూ మాస్టర్ – శివ, వంశీ అని చెప్పింది కానీ రాసింది వర్షిణి. వర్షిణి – అమన్ చెప్పింది కానీ రాసింది త్రిగున్. రామకృష్ణ – నీతూ అని చెప్పాడు కానీ రామ్ ప్రసాద్ రాసాడు. ముకేశ్ – దేబ్జానీ అని కరెక్ట్ గా చెప్పాడు. దాంతో రామ్ ప్రసాద్ కామెడీ చేయగా మధ్యలో నాగార్జున వర్షిణి మీద కౌంటర్లు వేసాడు. శివ – వర్షిణి అని చెప్పాడు కనై రాసింది ముకేశ్. రోహిత్ – శివ అని చెప్పాడు. కానీ రాసింది త్రిగున్. రామ్ ప్రసాద్ – వర్షిణి అని కరెక్ట్ గా చెప్పాడు. వంశీ – ముకేశ్ అని చెప్పాడు కానీ రాసింది రోహిత్. రోహిత్ మళ్ళీ వంశీతో మాట్లాడేసరికి నాగార్జున కౌంటర్ ఇచ్చాడు.
అనంతరం సన్ డే – ఫన్ డే గేమ్ అని చెప్పి సాంగ్స్ ని గెస్ చేసి డ్యాన్స్ వేసేలా డం షార్ట్స్ గేమ్ ఆడించారు. కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి ఆడించారు.
Also Read : Prabhas Sister : ట్రెడిషినల్ లుక్స్‌లో ప్రభాస్ చెల్లెల్లు.. ప్రసీద ఉప్పలపాటి ఫొటోలు..
అనంతరం రెడ్ జోన్ లో ఉన్న ముగ్గుర్ని నిలిచామన్నారు నాగార్జున. రోహిత్, రామకృష్ణ, శ్వేతా ఈ ముగ్గురిలో ఎవరు బయటకు వెళ్లాలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. రెడ్ జోన్ లో ఉన్నవారిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అని ముందు నుంచి బిగ్ బాస్ చెప్పిన విషయాన్నీ గుర్తు చేసారు. కంటెస్టెంట్స్ ఆ ముగ్గురిలో ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ కుండ మీద వాళ్ళ ఫోటో పెట్టి పగలగొట్టాలి. దానికి రీజన్స్ చెప్పాలి. మొదట ఈ ముగ్గురు హౌస్ లో ఉంచండి అని కంటెస్టెంట్స్ ని అని వాళ్ళ కారణాలు చెప్పి రిక్వెస్ట్ చేయాలి.
మొదట నరేష్ – రోహిత్ పేరు చెప్పాడు. దేబ్జాని – రోహిత్ పేరు చెప్పింది. రామ్ ప్రసాద్ – రోహిత్ పేరు చెప్పాడు. కారణాలు చెప్పేటప్పుడు త్రిగున్ పేరు రావడంతో మళ్ళీ రోహిత్ ఎప్పట్లాగే గొడవ పెట్టుకున్నాడు. వర్షిణి – రామకృష్ణ పేరు చెప్పింది. శివ – రోహిత్ పేరు చెప్పాడు. ముకేశ్ – రామకృష్ణ పేరు చెప్పింది. నీతూ – రామకృష్ణ పేరు చెప్పింది. అమన్ ఇన్నాళ్లు తన ఫ్రెండ్ అనుకుంటే రోహిత్ మోసం చేసాడని, ఇప్పుడు డైరెక్ట్ గానే ఫ్రెండ్ అనుకోలేదని చెప్పడంతో రోహిత్ పేరు చెప్పాడు. దాంతో కొంత ఎమోషనల్ అయ్యాడు. సుధీర్ – రామకృష్ణ పేరు చెప్పాడు. వంశీ – రోహిత్ పేరు చెప్పాడు. త్రిగున్ – రోహిత్ పేరు చెప్పాడు. తన కారణాలు అన్ని చెప్పి రాత్రి పూట రోహిత్, ముకేశ్ టీమ్ త్రిగున్ గురించి ఇష్టమొచ్చిన మాట్లాడిన మాటలు గుర్తుచేసి రోహిత్ ఎలిమినేట్ అవ్వాలి అన్నాడు. దాంతో రోహిత్ ఆ మాటలు బయటకొచ్చినందుకు షాక్ అయ్యాడు.
మొత్తంగా రామకృష్ణకు నాలుగు, రోహిత్ కి ఏడు ఓట్లు వచ్చాయి. దీంతో రోహిత్ ఎలిమినేట్ అయిపోయాడు. వెళ్ళేటప్పుడు కూడా రోహిత్ ఏం మారకుండా త్రిగున్ గురించి ఇన్ డైరెక్ట్ గా కంటెస్టెంట్స్ తో నెగిటివ్ గా మాట్లాడాడు. అందరితో ఇన్ డైరెక్ట్ గా త్రిగున్ గురించి చెప్తూనే వెళ్ళాడు.
Also Read : Scene Pre Release Event : సూర్య ‘సీన్’ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? ఫుల్ డీటెయిల్స్..
ఇక రోహిత్ స్టేజిపైకి వచ్చాడు. నీకు ఏడు ఓట్లు వేసిన ఏడుగురికి ఏం చెప్తావు అని నాగార్జున అడిగారు. దాంతో ఒక్కొక్కరితో రోహిత్ తను అనుకున్నది చెప్పాడు. ఈ మధ్యలో శివ – రోహిత్ కి గొడవ అయింది. అందరూ అనుకునే తన గ్రూపిజం గురించి, తన వల్లే తన గ్రూప్ వాళ్ల్లు వెళ్లిపోయారు అని చెప్పగానే నిజం అయినా తీసుకోలేకపోయాడు రోహిత్. ఎలిమినేట్ అయినా ఇంకా మారకుండా రియాలిటీ అర్ధం చేసుకోకుండా అలాగే ఉన్నాడు. అయితే టాప్ 5 లో ఉంటాడు అనుకున్న రోహిత్ ఎలిమినేట్ అవ్వడం కొందర్ని ఆశ్చర్యపరుస్తుంది. అయితే రోహిత్ గేమ్స్ బాగా ఆడినా ఇంట్లో ఏ పని చేయకపోవడం, పని చేయమంటే తిట్టడం, త్రిగున్ ని టార్గెట్ చేసి తినకూడని మాటలు అనడం, త్రిగున్ గురించి అందరి డాగర నెగిటివ్ చేయడం, మొదటి వారం నుంచి గ్రూపిజం చేయడం. అగ్ని పరీక్షా బ్యాచ్ వాళ్ళను తన చేతిలో పెట్టుకొని ఒక్కొక్కరిని వాళ్ళని వెళ్లేలా చేయడం, గేమ్ ఆడకుండా శాలినితో ఎక్కువ సేపు ఉండటం, ఎల్లో కార్డు వచ్చినా, ఇంటూ మార్క్ బ్యాడ్జ్ వచ్చినా ఏం మారకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం, చివరకు త్రిగున్ ని గెలవడం తన వల్ల కాక ముకేశ్ వాళ్ళతో కలవడం, మారమని, బయట నీ గురించి ఇలా ఉంది అని వైల్డ్ ఫైర్ వాళ్ళు చెప్పిన అతీసుకోలేకపోవడం.. ఇలాంటి వాటి వల్లే ఇవాళ రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు.
ఒకవేళ రోహిత్ మారి కొంచెం అన్నా రియాలిటీ అర్ధం చేసుకొని ఆడితే ఇవాళ ఎలిమినేట్ అవ్వకుండా ఉండేవాడు. కనీసం టాప్ 5 కి అయినా వెళ్ళేవాడు. మొత్తానికి బయట పీఆర్ టీమ్ పెట్టుకొని గట్టిగా ప్రమోట్ చేసుకొని, త్రిగున్, వేరే కంటెస్టెంట్స్ ని సోషల్ మీడియాలో తిట్టించి, ఓట్లు వచ్చేలా చేసుకొని చివరకు తన యాటిట్యూడ్ వల్లే ఎలిమినేట్ అవ్వడం గమనార్హం.
