Rishikanth : రామ్ చరణ్ సినిమాలో తమిళ హీరో..? రీసెంట్ ‘డొరొతీ’ సెన్సేషన్.. RC17 పూజ కార్యక్రమంలో రిషికాంత్..
ఈ రీసెంట్ సెన్సేషన్ హీరో రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. (Rishikanth)
Rishikanth
Rishikanth : ఇటీవల తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ హీరోగా రెండు సినిమాలు హిట్స్ కొట్టాడు రిషికాంత్. మొద రాత్రి సినిమాతో వైరల్ అయిన రిషికాంత్ ఇటీవల డొరొతీ సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఈ రీసెంట్ సెన్సేషన్ హీరో రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
రిషికాంత్ 2015 నుంచి తమిళ్ లో సినిమాలు చేస్తున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ షేడ్స్ లో మెప్పించాడు. తెలుగులో కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేసాడు. ప్రస్తుతం హీరోగా తమిళ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. నేడు సుకుమార్ రామ్ చరణ్ RC17 సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రిషికాంత్ హాజరయ్యాడు.
Also Read : Pawan Kalyan : OG 2 పక్కన పెట్టేసి పవన్ – దిల్ రాజు సినిమా..? ఆ డైరెక్టర్ తో..
దీంతో రామ్ చరణ్ సినిమాలో ఈ తమిళ్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే చర్చ మొదలైంది. అయితే పలువురు మాత్రం RC17 నిర్మాతలు మైత్రి నిర్మాణంలో రిషికాంత్ హీరోగా తమిళ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. అందుకే గెస్ట్ గా ఓపెనింగ్ కి వచ్చాడు అని అంటున్నారు. మరి రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఓపెనింగ్ కి ఈ తమిళ్ హీరో సరదాగా వచ్చాడా? లేక సినిమాలో నటిస్తున్నాడా తెలియాలంటే ఎదురు చూడాల్సిందే..
