Bigg Boss Today Promo : ఇంకా చల్లారని వేడి.. సృష్టి వర్సెస్ సుధీర్.. ఇవాళ కూడా రచ్చే.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..

మీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)

  • Published on- September 22, 2026 / 02:56 PM IST

Bigg Boss Season Promo

Bigg Boss Today Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నిన్నటి ఎపిసోడ్ లో మూడో వారం నామినేషన్స్ మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్స్ ఫుల్ ఫైర్ గా సాగాయి. మొత్తం సృష్టి – సుధీర్ హైలెట్ అయ్యారు నిన్న. సృష్టి ని నాగార్జున కంటెంట్ ఇవ్వట్లేదు అని తిట్టడంతో సుధీర్ ని వాడుకొని సుధీర్ ని తిట్టి నిన్న నామినేషన్స్ లో రెచ్చిపోయింది సృష్టి. అయితే ఇవాళ కూడా అదే కంటిన్యూ అయ్యేలా ఉంది.

తాజాగా బిగ్ బాస్ మరో ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో ఝాన్సీ సృష్టితో సుధీర్ గురించి మాట్లాడింది. సృష్టి మాట్లాడిన మాటలు తప్పు అని రామ్ ప్రసాద్ చెప్తున్నాడు. ఇక సృష్టి మళ్ళీ తన అగ్నిపరీక్ష టీమ్ వద్ద కూర్చొని సుధీర్ గురించి, ఇంట్లో వాళ్ళు మాట్లాడిన మాటల గురించి డిస్కస్ చేసింది. ఇక రోహిత్ ఝాన్సీపై కౌంటర్లు వేసాడు సృష్టి దగ్గర. మళ్ళీ రోహిత్ త్రిగున్ ని శకుని అంటూ హౌస్ లో వాళ్ళతో మాట్లాడాడు.

Also Read : Bigg Boss Telugu 10 today promo : వర్షిణి, షాలినిల మ‌ధ్య వాగ్వాదం.. మ‌ధ్య‌లో వ‌చ్చిన‌ త్రిగుణ్‌.. ఏంట్రా నీ బాధ అంటూ రెచ్చిపోయిన‌..

ఇక నామినేషన్స్ లో సృష్టి నిన్న సుధీర్ ఫ్రీడమ్ అంటూ మాట్లాడిన మాటలు చెప్పి నామినేట్ చేసింది. సుధీర్ తనని డిఫెండ్ చేసుకున్నాడు. నామినేషన్స్ లో భాగంగా నామినేట్ చేసిన వాళ్లపై చెత్త వేసే టాస్క్ ఇవ్వగా సృష్టి సుధీర్ పై కోపంగా వేసి తలపై బలంగా ఆ చెత్తను రుద్దింది. దీంతో సుధీర్ జీవితంలో దుమ్ము ధూళి పడుతూ ఉంటాయి. అందుకే స్నానం చేయాలి అని అన్నాడు. దీంతో నేటి ప్రోమో వైరల్ అవ్వగా ఇవాళ రాత్రికి వచ్చే ఎపిసోడ్ లో కూడా ఫుల్ నామినేషన్స్ ఫైర్ ఉండబోతుందని తెలుస్తుంది.

మీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..