Bigg Boss Today Promo : బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టిన అపూర్వ‌.. న‌రేష్‌తో బిగ్‌బాస్ కామెడీ..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రొమో (Bigg Boss Today Promo) వ‌చ్చేసింది.

Bigg Boss Season 10 Telugu Day 19 Promo 1 apoorva Enter into house comedy with naresh

Bigg Boss Today Promo : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో డే 19కి సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది. అపూర్వ, మిథిలేష్, రామకృష్ణల‌లో ఇంటి స‌భ్యులుగా ఎవ‌రు రావాల‌ని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాల‌ని కంటెస్టెంట్ల‌కు బిగ్‌బాస్ చెబుతాడు. ఇక ఇంటి స‌భ్యులు కూడా త‌మ‌కు న‌చ్చిన వారికి ఓటు వేశారు. టెన్ష‌న్ వారం కాబ‌ట్టి అంద‌రి కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన అపూర్వ‌ను ఇంట్లోకి పంపుతున్న‌ట్లు బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక హౌజ్‌లోకి వ‌స్తూనే.. యువ‌ర్‌ క్వీన్ ఈజ్ బ్యాక్, పులి బిడ్డ హౌస్‌లోకి ఎంట‌ర్ అవుతోంది అని అంటోంది అపూర్వ‌. ఆమె ఇంట్లోకి వ‌చ్చిన త‌రువాత ముకేష్ జోకులు చేస్తాడు. నేను మీ ఇద్ద‌రి (రోహిత్, అపూర్వ‌) అగ్ని ప‌రీక్షలో సాంగ్ చూడ‌లేదు. మీ ఇద్ద‌రు బెడ్‌రూమ్‌కి వెళ్లిన‌ప్పుడు ఆ సాంగ్ చేయాల‌ని కోర‌తాడు. దాని కోసం బెడ్రూమ్ ఎందుకు అని అపూర్వ న‌వ్వేస్తుంది.

Manchu Vishnu : కొరియాలో మంచు విష్ణు ఫ్యామిలీ.. వెకేష‌న్ ఫోటోలు వైర‌ల్‌..

ఆ త‌రువాత న‌రేష్ నిద్ర పోతుండ‌గా బిగ్ బాస్ అత‌డితో కాసేపు స‌ర‌దాగా ఆడుకుంటాడు. మొత్తానికి ప్రొమో అదిరిపోయింది.