Bigg Boss Today Promo : కెప్టెన్‌కు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో.. కెప్టెన్ అనే పిలవాలి.. ముకేశ్‌కు ఇచ్చిపడేసిన అపూర్వ.. తగ్గేదేలే..
నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో (Bigg Boss Today Promo) ఎవరు ఏ పని చేయాలని ఏ పని చేయకూడదు అన్నది అసైన్ చేస్తుండగా ముకేశ్, త్రిగుణ్‌లతో అపూర్వకు గొడవ జరిగినట్లుగా కనిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- September 28, 2026 / 11:22 AM IST
Bigg Boss Season 10 Telugu Day 21 Promo 1 apoorva fires on mukesh
Bigg Boss Today Promo : ముకేశ్ కెప్టెన్‌గా తప్పుకోగా.. అపూర్వను నాగార్జున కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ముకేశ్, అపూర్వలు కలిసి టాస్క్ ఆడి గెలిచారు కాబట్టి. ఇక కెప్టెన్‌గా మారిన తరువాత అపూర్వ తన అధికారాన్ని గట్టిగానే చూపిస్తున్నట్లుగా అర్థమవుతోంది. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో ఎవరు ఏ పని చేయాలని ఏ పని చేయకూడదు అన్నది అసైన్ చేస్తుండగా ముకేశ్, త్రిగుణ్‌లతో గొడవ జరిగినట్లుగా కనిపిస్తోంది.
ముకేశ్ మీరేం పని చేస్తారు అని అపూర్వ అడగ్గా.. డిష్ వాష్ అని దేబ్జానీ చెబుతుంది. ఇంతకు ముందు చెప్పాను కదా.. వినలేదా? అని ముఖేశ్ అనగా.. వినలేదని అంటుంది అపూర్వ. మీరు బయట చూసి వచ్చారు కదా అని ముకేశ్ ఏదో మాట్లాడుతుండగా ఇవే తగ్గించుకోవాలి మీరు అని అపూర్వ కాస్త గట్టిగానే చెబుతంది. నీ దగ్గర తగ్గించుకోను.. అని ముఖేశ్ అనగా.. ఖచ్చితంగా తగ్గించుకోవాలని అపూర్వ అంటుంది.
Meenakshi Chowdary : శ్రీవారి సన్నిధిలో నటి మీనాక్షి చౌదరి.. ఫోటోలు వైరల్..
ఇక ఈ వారం అంతా మూడు పూటలా డిష్ వాష్ ముకేశ్ చేయాలని, అంతేకాకుండా వెంటనే కెప్టెన్ రూమ్‌ని వెకేట్ చేయాలని అపూర్వ చెబుతుంది. రెండు పనులను ఒకేసారి ఎవరూ చేయలేరని ముకేశ్ చెప్పగా.. కెప్టెన్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలని అపూర్వ అంటుంది. మీరు అన్నప్పుడు లేదా? కెప్టెన్ అని పిలవాలని అపూర్వ కాస్త గట్టిగానే చెబుతంది. ఇంట్లోకి రాగానే ష్ ష్ అని అన్నావుగా.. అలా అంటే నేను భయపడతానా? కూర్చో అని ముఖేష్‌కి చెప్తుంది. కెప్టెన్ అని తాను పిలవను అని, ఏం చేస్తారో చేసుకోండి అని త్రిగుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మొత్తంగా అపూర్వ కెప్టెన్‌గా తన అధికారాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుంటే ముకేశ్, త్రిగుణ్ వంటి వాళ్లను నచ్చనట్లుగా కనిపిస్తోంది.
