Bigg Boss Today Promo : రోహిత్ మాట విని త్రిగున్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఝలక్ ఇచ్చిన ఝాన్సీ..
లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో మీరు కూడా చూసేయండి.. (Bigg Boss Today Promo)
- Saketh U
- Published on- October 9, 2026 / 04:28 PM IST
Bigg Boss Today Promo
Bigg Boss Today Promo : నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి, కెప్టెన్ అవ్వడానికి ఇద్దరిద్దరిగా కలిసి కంటెస్టెంట్స్ టాస్కులు ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో.. బిగ్ బాస్ ఐదుగురికి కెప్టెన్సీ పోటీకి ఛాన్స్ ఉందని చెప్పాడు. అమన్, త్రిగున్ కలిసి టాస్కులు ఆడుతున్నారు కాబట్టి త్రిగున్.. అమన్ తో ఉన్న ఒప్పందం ప్రకారం కెప్టెన్సీ పోటీకి వెళ్తాను అని చెప్పాడు. ముందు ఒప్పుకున్నా అమన్ తర్వాత తన అగ్నిపరీక్ష బ్యాచ్ దగ్గర కూర్చోవడంతో రోహిత్ చెప్పినమాటలు విని కెప్టెన్సీ పోరుకు తప్పుకోను అని త్రిగున్ కి వెన్నుపోటు పొడిచాడు. దీంతో అమన్, షాలిని, వర్షిణి, త్రిగున్ ల మధ్య గొడవ అయింది.
ఇక ఝాన్సీ తన మ్యాజిక్ పవర్ ని ఓపెన్ చేసింది. తన మ్యాజిక్ పవర్ లో నామినేషన్స్ నుంచి తప్పుకోవచ్చు అని ఉంది. లేదా ఎవరినైనా తప్పించొచ్చు అని ఉంది. ఝాన్సీ ఏం చేసింది అనేది ఎపిసోడ్ లో చూడాలి. అయితే ఝాన్సీ ఆ పవర్ ని తన కోసమే వాడుకొని నామినేషన్స్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
Also Read : Tom Cruise : వరుస హిట్స్‌లో ఉన్న హాలీవుడ్ స్టార్ హీరో.. ముసలి వేషంతో సినిమా.. ఏకంగా 2000 కోట్ల నష్టం..
లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో మీరు కూడా చూసేయండి..
