Bigg Boss Today Promo : బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది.. నాగార్జున ఫైర్.. ఏడ్చేసిన ఝాన్సీ.. ప్రోమో వైరల్..
మీరు కూడా ఈ బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)
- Saketh U
- Published on- October 10, 2026 / 12:13 PM IST
Bigg Boss Today Promo
Bigg Boss Today Promo : నేడు శనివారం కావడంతో బిగ్ బాస్ ప్రేక్షకులు వీకెండ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో నాగార్జున బేస్ బాల్ ఆడే స్టిక్ తో కంటెస్టెంట్స్ ఫోటోలు ఉన్న కుండలను పగలగొట్టారు. మొదట అపూర్వ పై ఫైర్ అయ్యారు నాగార్జున. ప్రతిదానికి ఎందుకు అరుస్తావు. నీ పేరు అపూర్వ కాదు అరుపూర్వ అని అన్నారు.
అనంతరం అమన్ కి గత వారం ఎల్లో కార్డు ఇచ్చినా మారలేదు, బూతులు మాట్లాడావని ఫైర్ అయ్యారు. ఇక రోహిత్ – షాలిని రొమాన్స్, అర్ధరాత్రి ముచ్చట్లు, గ్రూప్ గేమ్ తెలిసిందే. వాళ్ళు వాళ్లకు ఇచ్చిన బాత్రూమ్స్ క్లీన్ చేసే పని చేయలేదని రోహిత్ – శాలినిపై వాళ్లకు చాలా పనులు ఉంటాయి, అర్ధరాత్రి సీక్రెట్స్ మాట్లాడుకోవాలి అని కౌంటర్లు వేశారు నాగ్.
Also Read : Mangli : ఎంగిలిపూల బతుకమ్మ .. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన సింగర్ మంగ్లీ..
ఇక వర్షిణి కెప్టెన్సీ బాగోలేదని, సరిగ్గా పనులు చేయించలేదని తిట్టారు. ఝాన్సీ, ముకేశ్ ఆడిన ఓ గేమ్ లో ఝాన్సీ మోసం చేసి ముకేశ్ కి ముందే హిట్స్ ఇచ్చిందని వీడియో చూపించాడు నాగార్జున. పల్లెటూరి నుంచి వచ్చినవాళ్లు స్వచ్ఛంగా ఉంటారు, వాళ్లకు మోసం తెలియదు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేసావు అని తిట్టడంతో ఝాన్సీ ఏడ్చేసింది. దీంతో నేటి ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది. నాగార్జున ఇంకా ఎవరెవరిపై ఫైర్ అవుతారు అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
మీరు కూడా ఈ బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో చూసేయండి..
