Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్..

తాజాగా ఈ వీకెండ్ ప్రోమో రిలీజ్ చేసారు. (Bigg Boss Today Promo)

  • Published on- October 10, 2026 / 04:55 PM IST

Bigg Boss Today Promo

Bigg Boss Rohith Promo : బిగ్ బాస్ లో రోహిత్ చేసే హంగామా చుస్తూనే ఉన్నాం. అగ్నిపరీక్ష బ్యాచ్ అందర్నీ తన గుప్పెట్లో పెట్టుకొని గ్రూప్ గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అపూర్వ, అమన్ లాంటి వాళ్ళు సొంతంగా ఆడదాం అనుకున్న రోహిత్ వాళ్ళని మార్చేస్తున్నారు. ఇక ఇంట్లో పనులు అయితే తనకు ఇచ్చినవి కూడా చెయ్యట్లేదు. ఇక అవసరం లేకపోయినా త్రిగున్ తో గొడవ పెట్టుకొని హైలెట్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. మరోవైపు షాలిని మాయలో పడి ఆమె వెనకే తిరుగుతూ, ఆమెతో రొమాన్స్ చేస్తూ ఉన్నాడు. రోహిత్ పై ప్రేక్షకుల నుంచి విమర్శకు వచ్చినా, నాగార్జున గత వారం ఎల్లో కార్డు చూపించినా మారలేదు.

తాజాగా ఈ వీకెండ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రెడ్ మార్క్ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంట్లో ఉన్నవాళ్లలో చాలా మంది రోహిత్ కె రెడ్ మార్క్ పెట్టి కారణాలు చెప్పారు. రోహిత్ వాళ్లకు సెటైర్ వేద్దాం అని చూసాడు. కానీ నాగార్జున తనకు తాను ఎన్ని మార్కులు వేసుకుంటావు అని అడిగితే 9 మార్కులు అని చెప్పాడు. దాంతో నువ్వేమి ఆడకుండా, ఏమి పని చేయకుండా అన్ని మార్కులు ఎలా వేసుకుంటావు అని ఫైర్ అయ్యారు. ఇంతమంది నుంచి తన ఆట తీరుకు నెగిటివిటి వచ్చినా ఇప్పటికి మారకపోతే రోహిత్ కే కష్టం.

Also Read : Singer Jhansi Bigg Boss Promo : బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది.. నాగార్జున ఫైర్.. ఏడ్చేసిన ఝాన్సీ.. ప్రోమో వైరల్..

మీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..