×
Ad

Amardeep Chowdary : బిగ్‌బాస్ సీజన్ 7లో పద్నాల్గవ కంటెస్టెంట్.. అమర్ దీప్.. విదేశాల్లో చదువుకొని ఇక్కడ స్టార్ గా మారి..

బిగ్‌బాస్ సీజన్ 7లో పద్నాల్గవ కంటెస్టెంట్ గా నటుడు అమర్ దీప్(Amardeep Chowdary) ఎంట్రీ ఇచ్చాడు.

  • Published On : September 4, 2023 / 10:59 AM IST

Bigg Boss Season 7 Fourteenth Contestant Artist Amardeep Chowdary Full Details

Amardeep Chowdary :  తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో పద్నాల్గవ కంటెస్టెంట్ గా నటుడు అమర్ దీప్(Amardeep Chowdary) ఎంట్రీ ఇచ్చాడు.

సీరియల్స్ చూసే వాళ్లకి అమర్ దీప్ బాగా పరిచయమే. విదేశాల్లో చదువుకున్న అమర్ దీప్ నటన మీద ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టాడు. సీరియల్స్ తో అవకాశాలు రావడంతో ఓ పక్క సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. సీరియల్స్ లో ఇప్పుడు హీరో పాత్రలు వేస్తూ ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే పలు చిన్న సినిమాల్లో కూడా హీరోగా నటిస్తున్నాడు. టీవీ షోలలో కూడా తన పర్ఫార్మెన్స్ లతో మెప్పిస్తున్నాడు.

Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7లో పదమూడవ కంటెస్టెంట్.. పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డ అని చెప్పుకుంటూ..

ఇటీవలే అమర్ దీప్ తేజస్విని గౌడ్ అనే మరో సీరియల్ నటిని వివాహం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి సారి బిగ్ బాస్ షోలో ఎవరో ఒకరు జంటగా వస్తారు. ఈ సారి అమర్ దీప్ – తేజస్విని జంటగా వస్తారు అనుకున్నారు కానీ అమర్ దీప్ ఒక్కడే వచ్చాడు.