Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7లో పదమూడవ కంటెస్టెంట్.. పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డ అని చెప్పుకుంటూ..
బిగ్‌బాస్ సీజన్ 7లో పదమూడవ కంటెస్టెంట్ గా ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఇన్‌ఫ్లూయెన్సర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఎంట్రీ ఇచ్చాడు.
- Saketh U
- Published On : September 4, 2023 / 10:37 AM IST
Bigg Boss Season 7 thirteenth Contestant Pallavi Prashanth Full Details
Pallavi Prashanth : తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.
ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో పదమూడవ కంటెస్టెంట్ గా ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఇన్‌ఫ్లూయెన్సర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఎంట్రీ ఇచ్చాడు.
పల్లవి ప్రశాంత్.. ఎక్కువమందికి తెలియదు. బయట కూడా పెద్దగా ఫేమస్ కాదు. కానీ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవాళ్ళకి ఇతను పరిచయమే. రైతు బిడ్డ అని చెప్పుకుంటూ రీల్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న, ఫ్యామిలీ చేసే వ్యవసాయంలో ఇతను కూడా పని చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటాడు. వీటితో పాటు అన్ని రకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమ్ రావడంతో ప్రమోషన్స్, ఈవెంట్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.
అయితే ఇతని మీద నెగిటివిటి సోషల్ మీడియాలో ఎక్కువగానే ఉంది. సాధారణంగా బిగ్ బాస్ నిర్వాహకులే కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు. కానీ ఇతనికి సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చిన దగ్గర్నుంచి నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి, నన్ను సపోర్ట్ చేయండి అని ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. దీని వల్ల కొంత నెగిటివిటి వచ్చింది. అంతే కాకుండా ఇతను రైతుల పేర్లు చెప్పుకొని సంపాదించుకుంటున్నాడు, రైతులని వాడుకుంటున్నాడు, వచ్చిన ఫాలోయింగ్ తో ప్రమోషన్స్, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు అని కూడా నెగిటివిటి ఉంది. అయితే ఎంత నెగిటివిటి వచ్చినా కొంతమంది మాత్రం అనుకున్నది సాధించాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పల్లవి ప్రశాంత్ షోలో ఏం చేస్తాడో చూడాలి.
