Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ 10 వచ్చేస్తోంది.. ఈ సారి కూడా నాగార్జుననే.. అనౌన్స్‌మెంట్ వీడియో..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 (Bigg Boss Telugu 10 ) అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- June 7, 2026 / 11:12 AM IST
Bigg Boss Telugu 10 announcement video out now
Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఈ షో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక 10వ సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి కూడా ఈ షో హోస్ట్‌గా నాగార్జుననే వ్యవహరించనున్నాడు.
బిగ్‌బాస్ 10వ సీజన్ త్వరలోనే రానుందని, తానే ఈ సారి కూడా హోస్ట్‌గా వ్యవరించనున్నట్లు తెలియజేస్తూ కింగ్ నాగార్జున స్పెషల్ వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Priyanka Nalkar : అబ్బాయిల పైన నమ్మకం లేదు.. పెళ్లి చేసుకోను.. సూ*సైడ్ థాట్స్.. ప్రియాంక కామెంట్స్..
తొలి రెండు సీజన్లు మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ కింగ్ నాగార్జుననే ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. ఇక ఈ సారి కూడా బిగ్‌బాస్ ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా సెలబ్రెటీలతో పాటు సామాన్యులను హౌస్‌లోకి పంపనున్నారని అంటున్నారు. ఈ సారి హౌస్‌లోని వెళ్లే సెలబ్రెటీలు ఎవరు? సామాన్యులు వెళతారా? లేదా? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు
