Bigg Boss Telugu 10 Day 1 Promo : బిగ్ బాస్ డే 1 కొత్త ప్రోమో వచ్చేసింది.. ఆ పది పవర్స్ చుట్టే ఆట అంతా..

మీరు కూడా బిగ్ బాస్ డే 1 ప్రోమో చూసేయండి.. (Bigg Boss Telugu 10 Day 1 Promo)

  • Updated on- September 7, 2026 / 06:42 PM IST

Image Credits : Star Maa Youtube Channel

Bigg Boss Telugu 10 Day 1 Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నిన్న ఘనంగా మొదలయింది. హౌస్ లోకి 16 మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే 10 స్పెషల్ పవర్స్ పెట్టి ఆ పవర్స్ గెలుచుకోటానికి నిన్నే టాక్సులు పెట్టిన సంగతి తెలిసిందే. త్రిగుణ్, ఝాన్సీ, రామ్ ప్రసాద్, షాలిని పటేల్, నరేష్, సృష్టి, వర్షిణి , నిహార్ లు గెలుచుకున్నట్టు నిన్న చూపించారు. ఇంకో ఇద్దరు ఎవరు గెలుచుకున్నారో నేడు చూడాలి.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ పవర్స్ గెలుచుకున్న వాళ్ళందర్నీ ఒక్కొక్కరిగా వెళ్లి ఆ బాక్స్ లో ఏ పవర్ ఉందో చూసుకోమన్నారు. వాటిల్లో చాలానే స్పెషల్ పవర్స్ ఉన్నాయి. అయితే ఎవరికీ ఏ పవర్ ఉందో వేరే వాళ్లకు చెప్తే వాళ్లకు ఆ పవర్ మాత్రం పోతుంది అని చెప్పారు. దీంతో ఇవాళ ఆట అంతా ఈ పది పవర్స్ చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది. ఫుల్ ఎపిసోడ్ నేడు రాత్రి 9.30 గంటలకు చూడాల్సిందే.

Also See : Chaithra Rai : బిగ్ బాస్ 10 లోకి వచ్చిన చైత్ర రాయ్.. ఆమె ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?

మీరు కూడా బిగ్ బాస్ డే 1 ప్రోమో చూసేయండి..