Bigg Boss 10 Telugu Captaincy : ఒకరి మీద ఒకరు పడి కొట్టేసుకొని.. ఏడ్చేసి.. గొడవపడి.. ఆఖరికి రోహిత్ వాళ్ళను అడుక్కొని.. బిగ్ బాస్ 10 ‘డే 10’ ఫుల్ ఎపిసోడ్..

ఇక కెప్టెన్సీ కోసం నెక్స్ట్ టాస్క్ లో నిన్న బెలూన్ గేమ్ లో ఓడిపోయిన మిగిలిన నలుగురు రోహిత్, త్రిగున్, రామ్ ప్రసాద్, దేబ్జానీ లను ఆడించారు.(Bigg Boss 10 Telugu Captaincy)

  • Updated on- September 17, 2026 / 10:25 AM IST

Image Credits : Jio Hotstar Bigg Boss Show

Bigg Boss 10 Telugu Captaincy : నిన్న కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన రౌండ్ లో గెలిచిన నలుగురికి ఇవాళ బిగ్ బాస్ ఇద్దరిద్దర్ని డివైడ్ చేసి యానిమల్స్ చూపించి యాక్ట్ చేస్తే ఇంకొకరు ఆ యానిమల్ ఏంటో గుర్తుపట్టి యానిమల్ బాక్స్ లను అమర్చాలి. ఝాన్సీ – ముకేశ్ ఒక జంటగా, అమన్ – షాలిని ఒక జంటగా ఆడారు. దీంట్లో ముకేశ్, ఝాన్సీ గెలిచారు. దీంతో షాలిని, అమన్ లో ఎవరో ఒకర్ని తప్పించమని బిగ్ బోస్ చెప్పడంతో ముకేశ్, ఝాన్సీ.. అమన్ ని కెప్టెన్సీ టాస్క్ ల నుంచి తప్పించారు సరిగ్గా యాక్ట్ చేయలేదు అని. అయితే అమన్ నేను చేశాను షాలిని సరిగ్గా పెట్టలేదు. షాలిని హైట్ లేదు. షాలిని సరిగా అర్ధం చేసుకోలేదు అనడంతో షాలిని అమన్ తో గొడవ పెట్టుకుంది. దీంతో ముకేశ్, ఝాన్సీ, షాలిని నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు.

అనంతరం కొంచెం బ్రేక్ ఇవ్వడంతో వంశీ, వర్షిణి మధ్య ఫుడ్ గురించి గొడవ పడింది. త్రిగున్- ముకేశ్ మధ్య కూడా ఫుడ్ గురించి గొడవ జరిగింది.

ఇక కెప్టెన్సీ కోసం నెక్స్ట్ టాస్క్ లో నిన్న బెలూన్ గేమ్ లో ఓడిపోయిన మిగిలిన నలుగురు రోహిత్, త్రిగున్, రామ్ ప్రసాద్, దేబ్జానీ లను ఆడించారు. దీంట్లో రామ్ ప్రసాద్ – త్రిగున్ ఒక టీమ్, దేబ్జానీ – రోహిత్ లు ఒక టీమ్ గా ఆడారు. పై నుంచి బ్యాగ్స్ పడతాయి. వాటిని పట్టుకోవాలి. బజర్ మోగే సమయానికి ఏ పెయిర్ చేతిలో ఆ బ్యాగ్ ఉంటే వాళ్లదే బ్యాగ్. తర్వాత అందులో ఉన్న బాల్స్ ఉపయోగించి ఫ్రేమ్ లో ఉన్న డిస్క్ లను కింద పడేయాలి. చివరి బజార్ లోపు ఏ పెయిర్ ఎక్కువ డిస్క్ లను పడేస్తే వాళ్ళు కెప్టెన్సీ రేసులో నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి వంశీని సంచాలకే గా నియమించాడు.

Also Read : Rohit vs Trigun Bigg Boss Promo 2 : కొట్టుకోవ‌డం ఒక్క‌టే త‌క్కువ‌..! రోహిత్ వ‌ర్సెస్ త్రిగుణ్‌.. ఆ జంపింగ్‌లు ఏంది సామీ.. టెంప‌ర్ వంశీతో వాగ్వాదం..

ఈ గేమ్ లో బ్యాగ్స్ కోసం ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారు. లాక్కోడానికి ట్రై చేసారు. దెబ్బలు తగిలించుకున్నారు. ఎవ్వరూ వదలకుండా ఆడారు. కానీ ఫైనల్ గా రామ్ ప్రసాద్ – త్రిగున్ టీమ్ గెలిచారు. ఓడిపోయినందుకు దేబ్జానీ ఏడ్చేసింది. రోహిత్ కూడా అలిసిపోయాడు. ఈ టాస్కుల మధ్యలో వంశీ – రోహిత్ బాగా గొడవ పెట్టుకున్నారు. కొట్టుకునే దాకా వెళ్లారు. ఈ టాస్క్ అయ్యాక మళ్ళీ అమన్, రోహిత్ తమ గ్రూపిజం బయట పెట్టారు. షాలిని, సృష్టి కూడా వచ్చి తమ అగ్నిపరీక్ష గ్రూపిజం బయటపెట్టారు. నిన్న కూడా అమన్ – షాలిని కలిసి మన గ్రూప్ అని మాట్లాడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ టాస్క్ లో చివరి రౌండ్ లో రోహిత్ అలిసిపోవడంతో, అప్పటికే రామ్ ప్రసాద్ టీమ్ లీడ్ లో ఉండటంతో రామ్ ప్రసాద్, త్రిగున్ లను ఒక్క బ్యాగ్ మాకు వదిలేయండి అని అడుక్కున్నాడు. గేమ్ ఆడలేను అన్నారు. లాస్ట్ టైం జీవపు ఇచ్చేశారని నామినేట్ చేసిన రోహిత్ ఇప్పుడు గివ్ అప్ ఇచ్చేసి త్రిగున్, రామ్ ప్రసాద్ లతో పోటీ పడలేక బ్యాఫ్ అడుక్కున్నాడు. దీంతో రామ్ ప్రసాద్ – త్రిగున్ ఈ పాయింట్ తర్వాత నామినేషన్స్ లో వాడొద్దు అనే కండిషన్ తో పోనిలే అని బ్యాగ్ ఇచ్చారు. అయినా గెలవలేకపోయారు రోహిత్ – దేబ్జానీ. మొత్తానికి ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్, త్రిగున్ గెలిచారు.

Also Read : Debjani Bigg Boss Today Promo : క‌న్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ..

దీంతో కెప్టెన్సీ రేస్ నుంచి రోహిత్, దేబ్జానీ లలో ఎవరో ఒకర్ని తప్పుకోమన్నాడు బిగ్ బాస్. వాళ్ళిద్దర్నే డిసైడ్ చేయమన్నారు. దీంతో రోహిత్ దేబ్జానీ ని తప్పించడానికి నువ్వు వీక్ అని చెప్పి వదిలేయమన్నాడు. ఆమెని కూడా తప్పుకొమ్మని అడుక్కున్నాడు. కానీ దేబ్జానీ ఒప్పుకోలేదు. వాళ్ళు ఫైనల్ అవ్వకపోవడంతో బిగ్ బాస్ రామ్ ప్రసాద్ – త్రిగున్ లను ఫైనల్ చేయమన్నాడు. దీంతో వాళ్ళు రోహిత్ ని తప్పించడంతో దేబ్జానీ, త్రిగున్, రామ్ ప్రసాద్ నెక్స్ట్ టాస్క్ లోకి వెళ్లనున్నారు. మొత్తానికి దేబ్జానీ, త్రిగున్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలిని లు ఇంకా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీళ్ళ మధ్య పోరాటం రేపు కొనసాగనుంది.