Bigg Boss Weekend Episode : మళ్ళీ ఏడ్చేసిన సృష్టి.. కండలు చూపించిన మిథిలేష్.. షాలినిపై ఫైర్.. బిగ్‌బాస్ 10 డే 20 వీకెండ్ ఎపిసోడ్..
మొదట సృష్టిని కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళమని ఆమె ఒక్కదాంతోనే మాట్లాడాడు నాగార్జున. (Bigg Boss Weekend Episode)
- Saketh U
- Published on- September 26, 2026 / 10:51 PM IST
Bigg Boss Weekend Episode
Bigg Boss Weekend Episode : నిన్న ముకేశ్ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. మొదట ముందురోజు జరిగింది చూపించారు. ముకేశ్ కెప్టెన్ గా గెలిచినందుకు మెడల్ ఇచ్చారు. కొత్తగా వచ్చిన మిథిలేష్ తన అగ్నిపరీక్ష బ్యాచ్ తో ముకేశ్ స్టార్ ప్లేయర్ కాదు అని అంతకుముందు జరిగిన సంఘటన గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. రోహిత్ అతనికి వంత పాడాడు. అపూర్వ సృష్టి చేసిన పనుల గురించి సుధీర్ దగ్గర మాట్లాడింది. అపూర్వ సృష్టి దగ్గరకు కూడా వెళ్లి సృష్టి చేసింది తప్పు అని చెప్పింది ఆమెకు. మిథిలేష్ ని దేబ్జానీ షర్ట్ ఇప్పి బాడీ చూపించమంది. దీంతో సరదాగా రామ్ ప్రసాద్ కూడా తీసి తన ఫ్యామిలీ ప్యాక్ చూపించాడు. నరేష్ కూడా షర్ట్ తీసాడు. అందరూ తమ లవ్ స్టోరీలు, కామెడీ స్టోరీలు చెప్పుకున్నారు సరదాగా.
అనంతరం నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మొదట సృష్టిని కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళమని ఆమె ఒక్కదాంతోనే మాట్లాడాడు నాగార్జున. సుధీర్ నెత్తి మీద చెత్త వేసి చేసిన పని చెత్తలా ఉందని దాని గురించి అడిగాడు. సుధీర్ చేసిన పనులన్నీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జునతో చెప్పుకొచ్చింది సృష్టి. తన పాత బ్రేకప్ బాధ చెప్పి ఏడ్చింది. అది ట్రామా కింద ఉంది అని చెప్పింది. ఇప్పుడు సుధీర్ కూడా అలాగే చూడడంతో తట్టుకోలేకపోయాను అని చెప్పి రోహిత్, త్రిగున్ ఇవన్నీ చెప్పారు అని చెప్పింది. అసలు అలా రియాక్టు అవుతాను అనుకోలేదని చెపింది. నాగార్జున సలహాలు ఇచ్చాడు పాతవి అన్ని మర్చిపొమ్మని. సుధీర్ సృష్టి మాట్లాడుకున్న వీడియో చూపించి అతను ఫన్ అని చెప్తే నువ్వు కూడా ఓకే అన్నావు మరి ఎందుకు రియాక్ట్ అయ్యావు అని గట్టిగానే అడిగారు. దీంతో సృష్టి లాస్ట్ వీక్ నాగార్జున ఏం చెయ్యట్లేదు అన్నందుకే ఇలా రియాక్ట్ అయిందని తెలుస్తుంది. సుధీర్ తో అంతా బాగానే ఉన్నా నామినేషన్స్ కి అలా ప్లేట్ తిప్పేసింది ఒక్క వీడియోతో తేలిపోయింది.
Also Read : Bigg Boss Today Promo : నువ్వు చేసిన పని చెత్త అన్న నాగార్జున.. మళ్ళీ ఏడ్చేసిన సృష్టి.. సుధీర్ ని కూడా..
నెక్స్ట్ సుధీర్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. సుధీర్ నేను సృష్టికి క్లియర్ గా చెప్పాను అన్ని. ఆమె అంతా ఓకే అని చెప్పింది కానీ రోహిత్ ఆమెకు ఎక్కించాడు లేనిపోనివి అని చెప్పాడు. అమ్మాయి ఏమన్నా అంటే నాకు నెగిటివ్ అవుతుంది. రోహిత్, త్రిగున్ వల్లే అలా అన్నాను అన్నాడు. దాంతో వాళ్ళు ఆడే పాచికల్లో నువ్వెందుకు బలి అవుతున్నావు అని అడిగాడు నాగ్. రెండు గంటలు డిస్కషన్ జరిగాక కూడా సృష్టి మ్యానిప్యులేట్ అయి నన్నే టార్గెట్ చేసింది. ఆమె నన్ను టార్గెట్ చేసి చేసింది ఇదంతా అని చెప్పుకొచ్చాడు. నాగార్జున కూడా సుధీర్ నీ తప్పేమి లేదని చెప్పాడు.
నెక్స్ట్ నరేష్ తో బజర్ గేమ్ లో వంశీ గెలిచినా దాని గురించి మాట్లాడారు నాగ్. వీడియో చూపించి అందులో నిజంగానే వంశీ గెలిచాడు. నీకు అన్యాయం జరగలేదు అని చెప్పాడు. దేబ్జానీతో కొన్ని మాటలు మాట్లాడుతున్నావు అని నరేష్ ని పొట్టోడు అనేది చెప్పి తిట్టారు. సారీ చెప్పింది . నరేష్ ని బాగా ఆడుతున్నావు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అని పొగిడాడు నాగ్. ముకేశ్ ని అమన్ ని బచ్చా అని తిట్టినందుకు తిట్టారు నాగ్. రామ్ ప్రసాద్.. కన్నింగ్ అనే మాటలకు రియాక్ట్ అయినదానికీ జాగ్రత్తలు చెప్పారు. అమన్.. వర్షిణి ని పట్టుకొని ఆడిన గేమ్ లో వర్షిణి వుమెన్ కార్డు వాడినందుకు బిగ్ బాస్ లో జెండర్స్ లేవు. ఎవరికన్నా టాస్క్ లో ఇబ్బందులు ఉంటే సంచాలక్ కి చెప్పండి అన్నాడు నాగ్. వుమెన్ కార్డు వాడినందుకు తిట్టాడు. వర్షిణి ఆడ పిల్లల మీద గెలిచాడు అని అన్న మాట తప్పు అని తిట్టారు నాగ్.
Also Read : Bigg Boss Telugu 10 Updates: బిగ్ బాస్ హౌస్ లో కొత్త గ్రూప్.. ఇప్పుడు అందరి టార్గెట్ వాళ్ళే..
రోహిత్.. అమన్ ని తిట్టినవి అన్ని వీడియో చూపించాడు నాగ్. రోహిత్ అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు అని తిట్టాడు నాగార్జున. అనంతరం నామినేషన్స్ లో ఉన్నవాళ్లను నిల్చోమని ఒక టాస్క్ ఇచ్చారు. అందులో సుధీర్ సేవ్ అయ్యాడు. రోహిత్ – ముకేశ్ టాస్క్ లో రోహిత్ గొడవ గురించి మాట్లాడి ముకేశ్ గెలిచాడు, అమన్ కరెక్ట్ గానే చెప్పాడు అని వీడియో చూపించి రోహిత్ కి కౌంటర్ ఇచ్చారు. చరణ్ రెండో సారి వచ్చినా ఏమి చేయట్లేదని తిట్టాడు. ముకేశ్ ని డిజర్వింగ్ కాదు అని అన్నందుకు తిట్టి సరిగా ఆడకపోతే నువ్వు డిజర్వ్ కాదు అని ఫైర్ అయ్యారు. వంశీని గేమ్స్ లో ఆడటం ఇంప్రూవ్ చేసుకోమన్నారు.
ఝాన్సీ ని కెప్టెన్ గా బాగా చేసావు అని పొగిడారు. రోహిత్ పనిచేయట్లేదు అని ఝాన్సీ ని తిట్టి చేయించుకోమన్నారు పని. షాలిని.. సృష్టి ని లాస్ట్ వీక్ నాగార్జున తిట్టారని ఇప్పుడు ఫైర్ అయింది అని చూపిన దానికి తిట్టారు నాగ్. సృష్టి దగ్గర ఒకలా, తన వెనక ఒకలా మాట్లాడినందుకు షాలిని ని బిచింగ్ స్టార్ అని అన్నారు. త్రిగున్ ని అభినందించారు. నీకు పోటీగా అపూర్వ వచ్చింది తనది గట్టి వాయిస్ అని చెప్పారు. నరేష్ ని గొడవ పెట్టుకొని అయినా సరే నామినేషన్స్ లోకి రమ్మన్నారు. నెక్స్ట్ మళ్ళీ నామినేషన్స్ వాళ్ళని పిలిచారు. అందులో షాలిని సేవ్ అయింది.
అనంతరం సందీప్ కిషన్, జేసన్ సంజయ్ సిగ్మా ప్రమోషన్స్ కి వచ్చారు. సందీప్ కిషన్.. తను, త్రిగున్ కలిసి కెరీర్ ఆరంభంలో ఆడిషన్స్ కి వెళ్ళాము అని అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఇంట్లో వాళ్లకు ఒక టెంప్టేషన్ ఇచ్చారు నాగ్. ఒక సూట్ కేస్ ఇచ్చి అందులో 5 లక్షలు ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే డబ్బు తీసుకొని వెళ్లిపోవచ్చు అన్నారు. ఎవరూ వెళ్లకపోవడంతో 10 లక్షలకు పెంచారు. అయినా వెళ్లకపోవడంతో 15 లక్షలకు పెంచారు. దాంతో మొన్నే వచ్చిన మిథిలేష్ వెళతా అన్నాడు కానీ ఇంట్లో వాళ్ళు అతన్ని కన్విన్స్ చేయాలి అన్నాడు నాగ్. మిథిలేష్ కన్విన్స్ అవ్వలేదు. దాంతో ఓటింగ్ పెట్టారు ఇంట్లో వాళ్లకు మిథిలేష్ వెళ్లాలా వద్దా అని. మొదట ఓట్లు తక్కువ పడినా కన్విన్స్ చేసాడు మిథిలేష్. దీంతో అతన్ని సూట్ కేస్ తీసుకొని బయటకు వచ్చేయమన్నాడు నాగ్. మరి బయటకు వచ్చాడో లేదో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాలి.
