Bigg Boss Telugu 10 : మరోసారి దొరికిపోయిన షాలిని – రోహిత్.. ఎప్పట్లాగే అగ్నిపరీక్ష గ్రూపిజం.. అపూర్వ అరుపులు.. బిగ్‌ బాస్ 10 డే 25 ఎపిసోడ్‌..

ఎవరూ లేనప్పుడు రోహిత్ - షాలిని గట్టిగా హగ్ చేసుకొని, సీక్రెట్ గా మాట్లాడుకొని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఎమోషన్స్ ని చూపించుకున్నారు. (Bigg Boss Telugu 10)

  • Published on- October 2, 2026 / 06:20 AM IST

Bigg Boss Telugu 10

Bigg Boss Telugu 10 : నిన్న అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా గ్రూపిజం చూపించి వేరే టీమ్స్ లో ఉన్నా కేవలం వాళ్ళ కోసం ఆడుకుంటున్నవిషయం బయట పెట్టేసారు. పబ్లిక్ గా తమ టీమ్ కోసం కాకుండా అగ్ని పరీక్షా బ్యాచ్ కోసం ఆది మోసం చేసినట్టు షాలిని – రోహిత్ చెప్పుకొని అందరికి షాక్ ఇచ్చారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్ లో అగ్ని పరీక్ష బ్యాచ్ అంతా గ్రూప్ గా కూర్చొని మాట్లాడుకున్నారు. సుధీర్, సెలబ్రిటీ బ్యాచ్ కొంతమంది షాలిని – రోహిత్ కలిసి చేసే గ్రూపిజం గురించి మాట్లాడుకున్నారు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు రోహిత్ ప్రాణం షాలినిలో ఉంది అని సుధీర్ అన్నాడు. రాత్రి పూట అందరూ పడుకున్నాక రోహిత్ అపూర్వతో కూర్చొని ఆమెని కూడా అగ్నిపరీక్ష బ్యాచ్ లోకి తీసుకురావడానికి మ్యానిప్యులేట్ చేసే ప్రయత్నం చేసాడు.

ఎవరూ లేనప్పుడు రోహిత్ – షాలిని గట్టిగా హగ్ చేసుకొని, సీక్రెట్ గా మాట్లాడుకొని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఎమోషన్స్ ని చూపించుకున్నారు. నిన్నటి గొడవ గురించి కూర్చొని మాట్లాడుకున్నారు. షాలిని మళ్ళీ ఎక్కడ గొడవలు పెట్టుకుంటుంది అని భయం పట్టుకుంది రోహిత్ కి. దీంతో నిన్నటి గొడవ తీసుకొచ్చి జాగ్రత్తలు చెప్పాడు.

Also Read : Dorothy Review : ‘డోరతి’ మూవీ రివ్యూ.. బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అయితే.. క్లైమాక్స్ ఏంట్రా బాబు ఇలా ఉంది..

అనంతరం బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం రెండో టాస్క్ పెట్టాడు. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు ఇద్దరు చొప్పున ఆడాలి. ఇది లెక్కలతో ఆడే గేమ్. బిగ్ బాస్ అడిగిన లెక్కలకు సమాధానాలు చెప్పి టైల్స్ సరిగ్గా బిగ్ బాస్ లోగో వచ్చేలా సెట్ చేసే గేమ్ ఆడాలి. మొదట భైరవ రెడ్ టీమ్ ఝాన్సీ, అపూర్వ, రోహిత్, వర్షిణి లు ఆడటానికి ముందుకొచ్చారు. బిగ్ బాస్ ఈ టీమ్ కి వాళ్ళ ఆపోజిట్ టీమ్ ని వాళ్లనే సెలెక్ట్ చేసుకోమన్నారు. దాంతో షాలిని,ముకేశ్, నరేష్, దేబ్జనిలను సెలెక్ట్ చేసుకున్నారు. త్రిగున్ దీనికి సంచాలక్. ఈ రౌండ్ లో రెడ్ భైరవ టీమ్ గెలవటంతో బ్లూ టీమ్ లో నుంచి ఒకరి కత్తి(డాగర్) తీసుకోమన్నారు. ఝాన్సీ – షాలిని కత్తి తీసుకుంది

రెడ్ టీమ్ బాగా ఆడటంతో బ్లూ టీమ్ నుంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తప్పించమన్నారు బిగ్ బాస్. దీంతో అందరూ అనుకున్నట్టే అందరూ టార్గెట్ చేసి త్రిగున్ ని తప్పించేసారు. వాళ్ళ డిస్కషన్ చూస్తే త్రిగున్ వస్తే వాళ్ళందర్నీ ఎక్కడ బెదిరిస్తాడో, ఎక్కడ ఆడేసుకుంటాడో అని భయపడినటు తెలుస్తుంది. ముఖ్యంగా అపూర్వ, రోహిత్ త్రిగున్ ని తీసేయాలని గట్టిగా చెప్పారు. వేళ్ళ టీమ్ లో వర్షిణి త్రిగున్ పేరు చెప్పలేదు. దీంతో వర్షిణి వచ్చి త్రిగున్ తో అందరూ నీ పేరే చెప్పారు. నిన్నే టార్గెట్ చేసారు అని చెప్పడంతో త్రిగున్ హౌస్ లో ఉన్న గ్రూపులు అన్నిటి గురించి చెప్పి డిస్కస్ చేసాడు.

ఇక రెండో టాస్క్ లో.. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు ఆడాలి. ట్రాలీలో కూర్చొని తాడుని ఎదురుగ ఉన్న పోల్ కి పడేలా విసరాలి. ఆ తాడు సహాయంతో ట్రాలీని అక్కడికి తీసుకెళ్లాలి. వాళ్ళ టీమ్ ఫ్లాగ్ ని ఆ పోల్ కి ఫిక్స్ చేసి దాన్ని సాధించాలి. ఒకరు సాధించింది ఇంకొకరి తమ ఆటతో గెలవచ్చు. చివరికి ఎవరు ఎక్కువ జెండాలు ఎవరు పెడితే వాళ్ళు విన్. అయితే దీంట్లో కేవలం లేడీస్ మాత్రమే ఆడాలి. ఏ ఇద్దరు ఆడాలో వాళ్లనే డిసైడ్ చేసుకోమన్నారు బిగ్ బాస్.

Also Read : Premane Oorilo Review : ‘ప్రేమనే ఊరిలో’ రివ్యూ.. కన్నడ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు తెలుగులో.. సాంగ్స్ సూపర్..

ఈ విషయంలో బ్లూ టీమ్ లో ఆడటానికి షాలిని ఎప్పట్లాగే ఏమి లేకుండానే ఓవర్ యాక్షన్ చేస్తూ అరిచింది. తను ఆడతను అని. ఎప్పట్లాగే తనే అరిచి తనే ఏడ్చింది. వెంటనే రోహిత్ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు షాలిని కోసం. ఆమెతో కూర్చొని డిస్కస్ చేసాడు. మొత్తానికి షాలిని నేను ఆడను, నాకు ఒక రోజు వస్తుంది అని వదిలేసింది. ఎవరు ఆడాలని రెండు టీమ్స్ లో గొడవ పడ్డారు. రెడ్ టీమ్ నుంచి ముందు అపూర్వ, ఝాన్సీ అనుకున్నారు కానీ చివరకు వర్షిణి అనడంతో వాళ్ళ అగ్ని పరీక్షా బ్యాచ్ కి ఎక్కడ మైనస్ అవుద్దో అని రోహిత్ తన రెడ్ టీమ్ తో, వర్షిణి తో గొడవ పడ్డాడు. వర్షిణి సొంత టీమ్ వాళ్ళే సపోర్ట్ చేయకపోతే ఎలా అని ఉన్న మాటే అంది. ఫైనల్ గా బ్లూ టీమ్ సృష్టి, దేబ్జానీ, రెడ్ టీమ్ నుంచి వర్షిణి, అపూర్వ ఆడారు. దీనికి త్రిగున్ సంచాలక్ గా ఉన్నాడు.

అయితే ఈ గేమ్ మొదట్లోనే అపూర్వ కింద పడిపోవడంతో నిర్ణయం త్రిగున్ ఇష్టం చెప్పాడు బిగ్ బాస్. దీంతో అసలు ఆడే అర్హతే లేదు అని త్రిగున్ చెప్పడంతో మరోసారి త్రిగున్ ని ఇష్టమొచ్చినట్టు అపూర్వ తిట్లు తిట్టింది. కానీ అందరూ అడగడంతో గేమ్ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. ఈ గేమ్ లో రెడ్ భైరవ టీమ్ 8 ఫ్లాగ్స్ పెట్టారు. సప్త శక్తి బ్లూ టీమ్ 12 ఫ్లాగ్స్ పెట్టారు. సప్త శక్తి గేమ్ గెలిచింది. దీంతో బిగ్ బాస్ రెడ్ టీమ్ లోని ఇద్దరి కత్తులు తీసుకునే ఛాన్స్ బ్లూ టీమ్ కి ఇచ్చారు. దేబ్జానీ – రోహిత్ కత్తి, సృష్టి – వర్షిణి కత్తి తీసుకున్నారు. అయితే మూడు టాస్కుల్లో రెండు రెడ్ భైరవ టీమ్ గెలవడంతో నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళ టీమ్ నుంచే ఉంటారని తెలిపాడు. దీంతో రేపు కెప్టెన్సీ టాస్క్ కేవలం రెడ్ టీమ్ లో ఉన్నవాళ్ళకి జరుగుతుందని తెలుస్తుంది. మొత్తానికి ఇవాళ కూడా రోహిత్ – షాలిని కలిసి వేరు వేరు టీమ్స్ లో ఉన్నా తమ అగ్నిపరీక్ష గ్రూపిజం బాగా చూపించారు.