Bigg Boss 10 Today Promo : హై రిస్క్‌లో అమ‌న్‌.. రామ్‌ప్ర‌సాద్ రియాలిటీ.. అమ‌న్‌, రోహిత్‌ల మ‌ధ్య వాగ్వాదం..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో నేటి ఎపిసోడ్‌కు (Bigg Boss 10 Today Promo) సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది.

Bigg Boss Telugu 10 Day 5 Promo 1 Argument between Aman and Rohit

Bigg Boss 10 Today Promo : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో తొలి వారంలోనే హౌస్‌లో ర‌చ్చ రచ్చ జ‌రుగుతోంది. రోహిత్ వ‌ర్సెస్ త్రిగుణ్ మ‌ధ్య ఓ రేంజ్‌లో ఫైట్ సాగుతోంది. నామినేష‌న్ల మంట రాజుకుంది. తాజాగా ఐదో రోజు (శుక్ర‌వారం సెప్టెంబ‌ర్ 11) ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుద‌లైంది. కంటెస్టెంట్లు హౌస్‌మేట్స్‌గా మార‌డానికి బిగ్‌బాస్ ర‌న్ రాజా ర‌న్ టాస్క్‌ను ఇచ్చాడు.

స‌ర్కిల్‌లో కూర్చున స‌భ్యుల చుట్టూ తిరుగుతూ ఎవ‌రి వెనుకైనా ఖ‌ర్చీఫ్ ను ప‌డేసి వారు లేచి ట‌చ్ చేసేలోపు వారి స్థానంలో వెళ్లి కూర్చోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఆట మొద‌లు పెట్ట‌గా తొలుత జాన్వీ, ఆ త‌రువాత షాలినీ ఇలా ఔట్ అయి పోగా.. ఆఖ‌రిలో న‌రేష్, అమ‌న్‌, రామ్ ప్ర‌సాద్ మిగిలారు. న‌రేష్ ఖ‌ర్చీను అమ‌న్ వెనుక వేసి ప‌రిగెత్తాడు. అమ‌న్ అత‌డి పట్టుకోవ‌డానికి ప‌రిగెత్తాడు. ఈ లోపు న‌రేష్ స‌ర్కిల్ చుట్టూ తిరుగుతూ అమ‌న్ స్థానంలోకి కూర్చుకున్నాడు. అదే స‌మయంలో అమ‌న్ డైవ్ చేశాడు. ఈ క్ర‌మంలో న‌రేష్ కాలు ట‌చ్ అయిన‌ట్లు అమ‌న్ ఆరోపించాడు. కాలు ట‌చ్ కాలేద‌ని న‌రేష్ వాదించాడు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

Saanve Megghana : తెలుగు అందం న‌వ్వితే.. శాన్వి మేఘ‌న‌ ఫోటోలు వైర‌ల్‌..

ఆ త‌రువాత హై రిస్క్‌లోకి ఎవ‌రిని పంపాల‌ని అనుకుంటున్నారో చెప్పాల‌ని రామ్‌ప్ర‌సాద్ ను బిగ్‌బాస్‌ను అడ‌గ్గా.. అమ‌న్ పేరు చెప్పాడు. అమ‌న్‌నే ఎందుకు పంపార‌ని రామ్‌ప్ర‌సాద్‌ను రోహిత్ అడిగాడు. నాతో ప్రేమ‌గా ఉన్న‌వాళ్ల‌తో ప్రేమ‌గానే ఉంటాను, లేని వాళ్ల‌తో వాళ్ల‌లాగే ఉంటాను. ఇదే నా రియ‌ల్ ఎమోష‌న్ అని రామ్ ప్ర‌సాద్ తెలిపాడు. నాకు ఓటు వేయ‌ని వారు ఎవ‌రో, ఇంకే ఎన్నో విష‌యాలు ఉంటాయ్ ఇదే క‌దా గేమ్ అని అన్నాడు.

ఇక చివ‌రిలో అమ‌న్‌, రోహిత్‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. నాకు బ్యాడ్జ్ ఇవ్వ‌గానే నువ్వు ప‌ర్‌ఫెక్ట్ అన్నావా అని రోహిత్ ను అమ‌న్ అడిగాడు. షాలిని ఏదో అన్నావంటా అని అమ‌న్ అన‌గా.. రోహిత్ ఫైర్ అవుతూ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.