Bigg Boss Family Week : మొదలయిన ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్.. ఇంట్లోకొస్తున్న ఫ్యామిలీ మెంబర్స్..
ఫ్యామిలీ వీక్ సందర్భంగా మొదట నరేష్ సోదరుడు సురేష్ వచ్చాడు. (Bigg Boss Family Week)
- Saketh U
- Published on- November 10, 2026 / 10:39 PM IST
family week
Bigg Boss Family Week : నిన్న నామినేషన్స్ పూర్తయ్యాయి. కెప్టెన్ వంశీ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. నేటి నుంచి ఫ్యామిలీస్ రానున్నారు హౌస్ లోకి. మొదట బిగ్ బాస్ స్కూల్ టాస్క్ పెట్టారు. శ్వేతా- ఆర్ట్, పిటి టీచర్, నీతూ – డ్యాన్స్ టీచర్, దేబ్జానీ – తెలుగు టీచర్, వర్షిణి – కెమిస్ట్రీ టీచర్, నరేష్ – ప్రిన్సిపాల్, ఇంగ్లీష్ టీచర్. మిగిలినవాళ్లు అందరూ స్టూడెంట్స్. దాంతో అందరూ స్కూల్ డ్రెస్ లు వేసుకొని స్కూల్ పిల్లల్లా మారిపోయారు. మొదట నరేష్ ఇంగ్లీష్ క్లాస్ తీసుకున్నారు. కాసేపు కామెడీ చేసారు.
ఫ్యామిలీ వీక్ సందర్భంగా మొదట నరేష్ సోదరుడు సురేష్ వచ్చాడు. దాంతో నరేష్ ఎమోషనల్ అయ్యాడు. ఇల్లంతా చూస్తూ అందరితో మాట్లాడాడు సురేష్. సురేష్, నరేష్, రామ్ ప్రసాద్ కలిసి మీటింగ్ పెట్టారు. సురేష్ నరేష్ కి కొన్ని సలహాలు ఇచ్చాడు. తర్వాత సురేష్ దేబ్జానీ తో పర్సనల్ గా మాట్లాడాడు. నరేష్ – సురేష్ కూర్చొని కలిసి తిన్నారు. అయితే నరేష్ గేమ్ లో ఛాలెంజ్ చేసి ఫ్యామిలీని కలిసే ఛాన్స్ పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ తన మాట మీద స్టాండ్ తీసుకొని వేరే వాళ్ళ కోసం త్యాగం చేసాడు కాబట్టి మొదట అతని ఫ్యామిలీనే పంపించాను అని చెప్పాడు బిగ్ బాస్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూపించి వీటి మీద రింగ్స్ వేస్తే అవి ఇంట్లో వాళ్లకు ఇస్తాం అని సురేష్ కి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
Also See : Anshu Selvamani : అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న రోజా కూతురు.. అన్షు లేటెస్ట్ ఫొటోలు..
నెక్స్ట్ వర్షిణి వచ్చి కెమిస్ట్రీ క్లాస్ తీసుకుంది. నెక్స్ట్ శ్వేతా వాళ్ళ అక్క వచ్చింది. శ్వేతా వాళ్ళ అక్కతో కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత శ్వేతా వాళ్ళ నాన్న రావడంతో హగ్ చేసుకొని ఏడ్చింది శ్వేతా. వాళ్ళ నాన్న కూడా ఎమోషనల్ అయ్యారు. శ్వేతా త్రిగున్ సపోర్ట్ గురించి చెప్పడంతో త్రిగున్ తో మాట్లాడారు వాళ్ళ నాన్న. చివర్లో అందరూ కలిసి డ్యాన్స్ వేశారు. ఫుడ్ రింగ్ గేమ్ శ్వేతా వాళ్ళ నాన్నకు కూడా ఇచ్చారు బిగ్ బాస్.
నెక్స్ట్ వంశీ కూతురు వచ్చింది. వంశీని హగ్ చేసుకోగానే వంశీ ఎమోషనల్ అయి ఏడ్చాడు. కూతురు కోసం వంశీ ఫుడ్ స్వయంగా వండాడు. తన కెప్టెన్ రూమ్ కి తీసుకెళ్లాడు. తర్వాత వంశీ వైఫ్ వచ్చింది. తన భార్యని హగ్ చేసుకొని వంశీ ఏడ్చేశాడు. త్రిగున్ సపోర్ట్ చేస్తున్నందుకు స్పెషల్ గా బ్రో అంటూ థ్యాంక్యూ చెప్పింది. త్రిగున్ వంశీ కూతురుతో ఆడుకున్నాడు. వంశీ – అతని భార్య కూర్చొని మాట్లాడుకున్నారు. త్రిగున్ కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడాడు. నీలాంటి ఫ్రెండ్ ఉండాలి అని, మీ మైండ్ అలా గేమ్ ఆలోచించడం గ్రేట్ అని వంశీ వైఫ్ చెప్పింది. వంశీ వైఫ్ అందరితో మాట్లాడింది. చివర్లో వంశీ భార్య, కూతురుకు కూడా ఫుడ్ రింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక రేపు స్కూల్ టాస్క్, ఫ్యామిలీ వీక్ కొనసాగనుంది.
