Shalini Bigg Boss: అపూర్వ రాకతో భయపడుతున్న షాలిని.. రోహిత్ విషయంలో మండుతున్నట్టుంది..
అపూర్వ రాగానే షాలిని మొదట షాక్ అయింది. (Shalini Bigg Boss)
- Saketh U
- Updated on- September 26, 2026 / 04:48 PM IST
Bigg Boss Telugu 10 Shalini Fears Due To Apoorva Entry In House
Shalini Bigg Boss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఎంత కాదనుకున్నా అగ్నిపరీక్ష బ్యాచ్ వాళ్లంతా గ్రూప్ గానే ఆడుతున్నారు. సెలబ్రిటీలలో అయినా మూడు నాలుగు బ్యాచ్ లు ఉన్నాయేమో కానీ అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఏం జరిగినా చివరికి ఒకటే అన్నట్టు ఉంటున్నారు. వీళ్ళలో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ సృష్టి, షాలినిలలో ఎంతో కొంత షాలిని ఒక్కతే కంటెంట్ ఇస్తుంది.
షాలిని రోహిత్ ని వెనకాల పెట్టుకొని గేమ్ ఆడుతుంది. అందరి మీద అరుస్తుంది. రోహిత్ కూడా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు షాలినికి కొత్త భయం పుట్టుకొచ్చింది. నిన్న హౌస్ లోకి అగ్నిపరీక్ష నుంచి మిథిలేష్, అపూర్వలు వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చిన సంగతి తెలిసిందే. అపూర్వ రాగానే షాలిని మొదట షాక్ అయింది.
Also See : Sowmya Rao : ఎద్దులబండి ఎక్కిన సీరియల్ నటి.. యాంకర్ సౌమ్య ఫొటోలు..
ఆల్రెడీ అగ్నిపరీక్ష లో అపూర్వ, రోహిత్ లు రొమాంటిక్ డ్యాన్స్ వేసి వైరల్ అయ్యారు. హౌస్ లోకి వచ్చాక కూడా అపూర్వ రోహిత్ తో డ్యాన్స్ వేసింది. వీళ్ళిద్దరూ డ్యాన్స్ వేస్తున్నప్పుడు షాలిని ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే మండుతున్నట్టు ఉంది అనే మీమ్ గుర్తొస్తుంది. వీళ్ళిద్దర్నీ ఇలా కలవడం చూసి షాలిని తట్టుకోలేకపోతుంది. రోహిత్ తన వైపు నుంచి అపూర్వ వైపుకు వెళ్ళిపోతాడేమో అని షాలిని భయం వేసినట్టు ఉంది. నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తావని ఇండైరెక్ట్ గా రోహిత్ తో కూడా అంది. అపూర్వ ఎంట్రీ ఇచ్చాక రోహిత్ తో షాలిని ఓ విషయంలో గొడవ కూడా పడింది. అయితే అపూర్వ రావడంతోనే అగ్నిపరీక్ష బ్యాచ్ తోనే గొడవలు పెట్టుకుంది. దీంతో ఇంకో భయం మొదలయినట్టు ఉంది షాలినికి.
అగ్నిపరీక్ష బ్యాచ్ నుంచి లేడీ కంటెస్టెంట్స్ లో షాలిని టాప్ 5 ఉంటుంది అనుకుంటున్నారు కొంతమంది. అపూర్వ ఎంట్రీ ఇచ్చాక అది మిస్ అవుద్దని భావిస్తున్నారు. షాలిని తో పోలిస్తే అన్నిట్లోనూ అపూర్వ బెటర్ గానే కనిపిస్తుంది. అపూర్వ అందరితో కలిసిపోతుంది, గొడవలు బాగా పడుతుంది, సెలబ్రిటీల సపోర్ట్ మొదటి రోజే తెచ్చుకుంది. పైగా ఎక్స్ పోస్ చేస్తాను అంటూ కామెంట్స్ కూడా చేసింది. బయట కూడా షాలిని తో పోలిస్తే అపూర్వ కు ఫాలోయింగ్, మోడల్ ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎక్కువే. దీంతో షాలిని ని పక్కకు నెట్టేసి అపూర్వ ఆమె ప్లేస్ లోకి వచ్చింది అని భావిస్తున్నారు ఆడియన్స్. మరి అపూర్వ ని తట్టుకొని షాలిని నిలబడుతుందా చూడాలి.
Also Read : Satya Master : ఇంటి సమస్య బయటపడింది.. అందుకే మేం మాట్లాడుతున్నాం.. సత్య మాస్టర్ కామెంట్స్..
