Bigg Boss Telugu 4 contestant : మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి యాంకర్ లాస్య

  • Publish Date - September 6, 2020 / 06:10 PM IST

Bigg Boss Telugu 4 contestant Lasya Manjunath: బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్‌గా యాంకర్ లాస్య ఎంట్రీ ఇచ్చింది.. ముందుగా తన ప్రొమోతో నా పేరు లక్ష్మి ప్రసన్న లాస్య ప్రియాంకా రెడ్డి.. అంటూ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలని తాను లాస్యగా మారినంటూ తన ప్రొమోలో పరిచయం చేసుకుంది.  మంజునాథ్ తో ప్రేమ పెళ్లి తర్వాత తమ లైఫ్ లోకి కుమారుడు దక్ష్ (జున్ను) రావడంతో తానే తన ప్రపంచమంటూ చెప్పింది.. అనుకోకుండా వచ్చిన అవకాశం తన జీవితాన్నే మార్చేసిందని చెప్పుకొచ్చింది..

చీమ జోక్‌.. అనగానే లాస్యా గుర్తొస్తుంది.. తనను చీమ జోక్, ఎక్కాలు చెప్పమని నాగార్జున ఆటపట్టించాడు.. తన కుమారుడి AV  చూపించగానే ఆనందంతో ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.. తన కుమారుడు దక్ష్  (జున్ను) తాను ఎంతో మిస్ అవుతున్నానంటూ భావోద్వేగానికి గురైంది..  లాస్యాకు తన కుమారుడిని గుర్తు చేసుకునేలా ఓ చిన్న బాబు బొమ్మను నాగార్జున గిఫ్ట్ గా ఇచ్చాడు..  తన జున్ను బేటా ఐ లవ్ యూ అంటూ ఆ బొమ్మను హత్తుకుంది.. ఆ తర్వాత మూడో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది..

యాంకర్, టీవీ షో హోస్టుగా పేరొందిన లాస్యా మంజునాథ్ అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.. 2012లో యాంకర్ రవితో కలిసి ‘Something Special’ షోతో పాపులర్ అయింది. ఈ షోతో యువ ప్రేక్షకులలో మరింత ఆదరణ సంపాదించుకున్నారు యాంకర్ లాస్య.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆడియెన్స్‌ను ఆకర్షించింది.



ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించిన లాస్యా హైదరాబాద్‌లోని ప్రముఖ చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ చేసింది. సమ్థింగ్ స్పెషల్ టీవీ షో తరువాత ఆమె 2014లో ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, 2016లో మా ఓరి వంట, 2017లో ‘ఢీ అల్టిమేట్ డాన్స్ షో’ వంటి పలు రకాల టీవీ షోలతో ఆకట్టుకుంది. యాంకర్‌గా ఎన్నో అవార్డులు లభించాయి. 2014లో బెస్ట్ ఫిమేల్ వీడియో జాకీ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.



లాస్యా తాను ప్రేమించిన మంజునాథ్‌ను 2017లో వివాహం చేసుకుంది. అదే సంవత్సరంలో ‘Raja Meru Keka’ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. 2018లో వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ మూవీ ‘ఎమ్మెల్యే’మూవీలో సోదరిగా లాస్యా నటించింది. ఆ తర్వాత టీవీ, మూవీలకు బ్రేక్ ఇచ్చారు.



గత బిగ్ బాస్ సీజన్ 3లో లాస్యా మంజునాథ్ పాల్గొంటొందనే వార్తలను అప్పట్లో  లాస్యా ఖండించింది. కానీ, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4తో మళ్లీ టెలివిజన్ షోలోకి వస్తున్నారు.. బిగ్ బాస్ టీవీ షోలో కూడా ఎప్పటిలాగే తనదైన శైలిలో ఎలా అభిమానులను అలరిస్తారో చూడాలి..