Bigg Boss 7 : ఒక మొక్కని చూసుకోలేని వాడు రైతు బిడ్డా.. నాగార్జున ఇచ్చి పడేశాడు
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్-7 రసవత్తరంగా సాగుతోంది. రెండో వారం పూర్తి కావొచ్చింది. వీకెండ్ ఎపిసోడ్‌కు నాగార్జున (Nagarjuna) వచ్చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : September 16, 2023 / 05:24 PM IST
Bigg Boss Telugu 7 Day 13 Promo
Bigg Boss 7 : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్-7 రసవత్తరంగా సాగుతోంది. రెండో వారం పూర్తి కావొచ్చింది. వీకెండ్ ఎపిసోడ్‌కు నాగార్జున (Nagarjuna) వచ్చేశాడు. రెండో వారంలో కంటెస్టెంట్లు ఎలా ఆడారు అన్న దానిపై కింగ్ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ప్రొమోను తాజాగా విడుదల చేశారు. శివాజా, అమర్‌దీప్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌లతో పాటు ప్రియాంక జైన్‌లకు కాస్త గట్టిగానే చెప్పినట్లు ప్రొమోను బట్టి అర్థం అవుతోంది.
ప్రతీ విషయంలోనూ వయసు అంశాన్ని తీస్తున్న షకీలాకు చాలా కూల్‌గా నాగార్జున కౌంటర్ ఇచ్చాడు. ఇక నామినేషన్స్ సందర్భంగా పల్లవి ప్రశాంత్ పై అమరదీప్ అరిచిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున స్పందించారు. ‘అతడి డబ్బులు అతడి ఇష్టం అని. అతడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు నీకెందుకు.’ అని అమర్‌దీప్‌ను ప్రశ్నించాడు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు పల్లవి ప్రశాంత్‌కు నాగార్జున ఓ మొక్కను ఇచ్చిన సంగతి గుర్తుందిగా.. ఆ మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలని నాగ్ అప్పుడు చెప్పారు.
Game Changer : ”జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చెనండీ..” గేమ్ ఛేంజర్ నుంచి సాంగ్ లీక్..
అయితే..ఆ విషయాన్ని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ మొక్క ఆకులు రాలిపోవడంతో పాటు పూర్తిగా ఎండిపోయింది. ఆ మొక్కను స్టేజీపైకి తీసుకువచ్చిన నాగార్జున.. ఆ మొక్కను చూపిస్తూ.. ‘ఒక మొక్కను చూసుకోని వాడు రైతు బిడ్డా అని అన్నాడు. దీంతో ప్రశాంత్ తలను దించుకున్నాడు. మరీ ప్రశాంత్ ఏం సమాధానం చెప్పాడో తెలియాలంటూ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
