Bigg Boss Telugu 7 Day 96 Promo
Bigg Boss Telugu 7 Day 96 Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులు ఓటు అప్పీల్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇందుకోసం బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఇందులో త్రో బాల్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. టాస్క్‌లో పలు రౌండ్లు ఉంటాయని, ఎవరికైతే ఎక్కువ బాల్స్ అంటుకుని ఉంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు.
1134 Trailer : రాబరీ నేపథ్యంతో ‘1134’ సినిమా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
దీంతో ఇంటి సభ్యులు ఆటను విధానాన్ని మార్చారు. అప్పటి వరకు బాల్స్ విసిరికొట్టగా ఇప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ దుస్తులకు బాల్స్ అంటిస్తున్నారు. శోభాశెట్టి, యావర్‌లు మొదటి రౌండ్‌లోనే ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో రౌండ్‌లో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఉంటే ఎంత పోతే ఎంత..? వీడి గురించి అందరికీ తెలియాలి అని అమర్ దీప్ అనగా అందరికి తెలుసు అంటూ ప్రశాంత్ బదులిచ్చాడు. మొత్తంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది.