Bigg Boss Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వంశీని భుజాల మీదకు ఎత్తుకున్న త్రిగున్.. ఏడ్చేసిన వర్షిణి..
నిన్నటి కెప్టెన్సీ టాస్కులు, రివెంజ్, రివార్డ్ టాస్కులు కొనసాగాయి. (Bigg Boss Captain)
- Saketh U
- Published on- November 6, 2026 / 10:39 PM IST
Bigg Boss Captain
Bigg Boss Captain : నిన్నటి కెప్టెన్సీ టాస్కులు, రివెంజ్, రివార్డ్ టాస్కులు కొనసాగాయి. ఉదయాన్నే వర్షిణి కప్ కడగలేదు, ఫుడ్ వేస్ట్ చేసింది అని కెప్టెన్ త్రిగున్ వర్షిణి ఉదయం చాయ్ కట్ చేసాడు. దీంతో ముకేశ్ – వర్షిణి డిస్కషన్ పెట్టుకున్నారు. సుధీర్ ముకేశ్ – వర్షిణి తనను అన్న మాటల గురించి, వాళ్ళు మారిపోయిన దాని గురించి గురించి త్రిగున్, వంశీ దగ్గర మాట్లాడాడు. వర్షిణి కి చాయ్ ఇవ్వనందుకు వచ్చి త్రిగున్ తో గొడవ పెట్టుకుంది. బాత్రూం క్లీన్ చేయనందుకు త్రిగున్ అడగడంతో వర్షిణి గొడవ పెట్టుకుంది. మధ్యలో ముకేశ్ వచ్చి గొడవ పెట్టుకున్నాడు.
రివార్డ్, రివెంజ్ టాస్కుల్లో గెలిచి వంశీ, శ్వేతా, త్రిగున్, దేబ్జానీ.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అలాగే ఫ్యామిలీలను కూడా కలుసుకోవచ్చు నెక్స్ట్ వారం. రివెంజ్ కి గురవ్వని వాళ్ళు ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితే ఫ్యామిలీలను కలుసుకోవచ్చు అని చెప్పారు. రామకృష్ణ, వర్షిణి,అమన్,ముకేశ్ రివెంజ్ కి గురయ్యారు కాబట్టి ఫ్యామిలీలను కలిసే ఛాన్స్ కోల్పోయినా ఒక ఛాన్స్ ఇస్తా అందులో ఎవరు విన్ అయితే వాళ్ళు ఫ్యామిలీను కలుసుసుకుంటారు అని చెప్పాడు బిగ్ బాస్.
Also Read : Om Raut Trolls : రామాయణం ఎఫెక్ట్.. ఓం రౌత్ పై ట్రోల్స్.!
దాంతో ఈ నలుగురికి ఒక టాక్ ఇచ్చారు. ఇద్దరిద్దరుగా ఆడాలి. ఎవరు గెలిచినా ఆ ఇద్దరిలో ఒకరే ఫ్యామిలీని కలుసుకోగలరు. ఈ టాస్క్ లో వర్షిణి – ముకేశ్, అమన్ – నరేష్ ఆడారు. ఇందులో వర్షిణి – ముకేశ్ గెలిచారు. అయితే వాళ్ళు సరిగ్గా ఆడలేదని అందరూ నరేష్ సంచాలక్ కావడంతో అతనితో గొడవ పడ్డారు. అమన్, రామకృష్ణ కూడా నరేష్ తో గొడవపడ్డారు. తప్పు అయితే నేను నా ఫ్యామిలీని కలవను అని అన్నాడు నరేష్. ముకేశ్ – వర్షిణిలలో ఎవరో ఒకర్ని డిసైడ్ చేసుకోమన్నాడు బిగ్ బాస్. ముకేశ్ ఫ్యామిలీని కలవడానికి సెలెక్ట్ అయ్యాడు. ముకేశ్ కోసం వర్షిణి తన ఫ్యామిలీని కలిసే ఛాన్స్ ని త్యాగం చేసి ఏడ్చింది.
చివరకు కెప్టెన్ టాస్క్ DJ టాస్క్ ఇచ్చారు. కంటెండర్స్ నలుగురు ఉంటారు. మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు మిగతా వాళ్ళు డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగాక ఫస్ట్ ఎవరు గంటని అందుకుంటారో వాళ్ళు ఒక దండ తీసుకొని కెప్టెన్ ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళ మెడలో దండ వేయాలి. కెప్టెన్సీ రేసులో త్రిగున్, వంశీ, శ్వేతా, డెబీజాని ఉన్నారు. ఇంట్లో వాళ్ళకే కెప్టెన్ ఎంచుకునే ఛాన్స్ ఇచ్చారు. ఎక్కువ ఎవరికి దండలు పడతాయో వాళ్ళు కెప్టెన్ అవుతారు.
Also See : Rakul Singh : రామాయణం వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు వైరల్..
వర్షిణి – శ్వేతాకు దండ వేసింది. శివ – వంశీకి దండ వేసాడు. నరేష్ – వంశీకి, ముకేశ్ – శ్వేతాకు, అమన్ – శ్వేతాకు, సుధీర్ – వంశీకి, రామకృష్ణ – వంశీ, రామ్ ప్రసాద్ – వంశీకి, నీతూ మాస్టర్ – వంశీకి దండలు వేశారు. దీంతో ఎక్కువ దండలు వంశీ కి పడటంతో వంశీ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాక అందరూ కెప్టెన్సీ గురించి డిస్కషన్స్ పెట్టుకున్నారు. ఈ వారం కెప్టెన్ గా వంశీ నిలిచారు. వంశీ కెప్టెన్ అవ్వడంతో అతని ఫ్రెండ్ త్రిగున్ వంశీని భుజాల మీద ఎక్కించుకొని తిప్పాడు.
