Bigg Boss 7 : బిగ్‌బాస్ 7 డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే షురూ.. గెట్ రెడీ
తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడో సీజన్ త్వరలో ప్రారంభమవుతుంది అంటూ గత కొద్ది రోజులుగా ఊరిస్తూ వస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 21, 2023 / 05:35 PM IST
Bigg Boss Telugu season 7
Bigg Boss Telugu season 7 : తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడో సీజన్ త్వరలో ప్రారంభమవుతుంది అంటూ గత కొద్ది రోజులుగా ఊరిస్తూ వస్తున్నారు. తాజాగా 7వ సీజన్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా రెండో సీజన్‌కు నాని చేశాడు. ఇక మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ 7కు సంబంధించి ఉల్టా ఫుల్టా అంటూ ఇటీవల ఓ టీజర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌తో సీజన్ 7 పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. గత కొన్ని సీజన్లుగా బిగ్‌బాస్ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభం అవుతూ వస్తోండగా తాజాగా ఆ సెంటిమెంట్‌నే కొనసాగించారు.
Kushi : ఇండియాలో విజయ్ దేవరకొండ.. అమెరికాలో సమంత.. ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారుగా..
సెప్టెంబర్ 3 నుంచి సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. బిగ్‌బాస్ రెవల్యూషన్‌కు సిద్ధంగా ఉండండి. “ఇది అంతం కాదు.. మీ ఆలోచనలను ఉల్టా..పుల్టా చేసే సీజన్. మీరు సిద్దంగా ఉన్నారా..? స్టార్ మా ఛానెల్లో సెప్టెంబర్ 3న బిగ్‌బాస్ తెలుగు 7 గ్రాండ్ లాంచ్ ఫ్రారంభం.” అంటూ స్టార్ మా ట్వీట్ చేసింది. అంతేకాదు ఉల్టా ఫుల్టా ప్రొమోను మరోసారి పోస్ట్ చేసింది.
ఇక సీజన్లో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారు..? ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. అమరదీప్ – తేజస్విని జంట, సీరియల్ ఆర్టిస్ట్ శోభిత శెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, కార్తీకదీపం మోనిత, ప్రభాకర్ తదితరులు షోలో సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Sunny Deol : సన్నీడియోల్, అక్షయ్ కుమార్ల మధ్య ఒప్పందం..? అప్పు తీర్చనున్న ఖిలాడి..?
