Bigg Boss 8 – Nabeel Afridi : బిగ్ బాస్ సీజన్ 8.. పద్నాలుగో కంటెస్టెంట్.. నబీల్ ఆఫ్రిది.. ఎవరితను?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పద్నాలుగో కంటెస్టెంట్ గా యూట్యూబర్ నబిల్ ఆఫ్రిది ఎంట్రీ ఇచ్చాడు.
- Saketh U
- Published On : September 1, 2024 / 10:13 PM IST
Bigg Boss Telugu Season 8 Started fourteenth Contestant Nabeel Afridi
Bigg Boss 8 – Nabeel Afridi : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా మొదలైంది. నాగార్జున హోస్టింగ్ తో కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇచ్చారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల, ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, ఎనిమిదో కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా, తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి కిరాక్ సీత, పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ, పదకొండో కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్ శెట్టి, పన్నెండో కంటెస్టెంట్ గా యాంకర్ విష్ణుప్రియ, పదమూడో కంటెస్టెంట్ గా డ్యాన్సర్ నైనిక రాగా పద్నాలుగో కంటెస్టెంట్ గా నబిల్ ఆఫ్రిది వచ్చాడు.
Also Read : Bigg Boss 8 – Nainika : బిగ్ బాస్ సీజన్ 8.. పదమూడో కంటెస్టెంట్.. డ్యాన్సర్ నైనిక గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పద్నాలుగో కంటెస్టెంట్ గా యూట్యూబర్ నబిల్ ఆఫ్రిది ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్ లో వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు నబీల్. యూట్యూబ్ తో గుర్తింపు తెచ్చుకున్న నబీల్ ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
