Bigg Boss Telugu Wild Card Entry: చైత్ర, చరణ్.. ఇద్దరిలో ఒకరు కంబ్యాక్.. వైల్డ్ కార్డు ఎంట్రీ.. వాళ్ళ పీఆర్ టీమ్ బాగా పనిచేస్తుందిగా..
ఈ ఇద్దరిలో ఒకరు ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారు. (Bigg Boss Telugu 10 Wild Card)
- Saketh U
- Updated on- September 16, 2026 / 10:48 AM IST
Charan Chaitra Bigg Boss Telugu 10 Wild Card Entry
Bigg Boss 10 Telugu Wild Card : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మొదటి వారమే చరణ్, చైత్రలను ఎలిమినేట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. వీళ్ళు ఇంటికి కూడా వెళ్లిపోయామని క్లారిటీ ఇచ్చేసారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరు ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారు. నిన్న ఎపిసోడ్ అయ్యాక చైత్ర, చరణ్ ఇద్దరి పేర్లను ప్రకటించి వాళ్లలో ఎవరు మళ్ళీ ఇంట్లోకి రావాలనుకుంటున్నారో వాళ్లకు వోట్ వేయమని జనాలకు చెప్పాడు బిగ్ బాస్.
దీంతో త్వరలోనే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్ లోకి అడుగు పెడతారని తెలుస్తుంది. అయితే చరణ్ పీఆర్ టీమ్ బాగా పనిచేస్తుంది. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, ఫేక్ కామెంట్స్, చాలా అకౌంట్స్ నుంచి పోస్టులు, వేరే పోస్టుల కింద కామెంట్స్ చేస్తూ, చాలా మందితో ఓట్ చేయిస్తున్నారు. ముందు నుంచి అగ్నిపరీక్ష బ్యాచ్ తమ పీఆర్ టీమ్ ని స్ట్రాంగ్ గా పెట్టుకొని వచ్చారు.
Also Read : Ayushi Patel : టాలీవుడ్ హీరోయిన్ పాన్ ఇండియా సినిమా.. మరో వైపు ఓటీటీలో సిరీస్..
రోహిత్, షాలిని పీఆర్ టీమ్స్ అయితే సెలబ్రిటీల టీమ్స్ కంటే పెద్దవి. ఇందుకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళ పీఆర్ టీమ్స్ కూడా ఇప్పుడు చరణ్ కోసం పనిచేస్తున్నాయి. దీంతో ఓటింగ్ ద్వారా తీసుకుంటే మాత్రం చరణ్ హౌస్ లోకి వస్తాడని తెలుస్తుంది. చైత్ర పీఆర్ టీమ్ అంతగా పని చెయ్యట్లేదు. అసలు ఆమె పీఆర్ టీమ్ ని పెట్టుకున్నట్టు కూడా అనిపించట్లేదు. ఇలా అయితే చైత్రకు కష్టమే. మరి చూడాలి ఈ ఇద్దరిలో ఎవరు బిగ్ బాస్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తారో.
