Ayushi Patel : టాలీవుడ్ హీరోయిన్ పాన్ ఇండియా సినిమా.. మరో వైపు ఓటీటీలో సిరీస్..
ఢిల్లీ భామ ఆయుషి పటేల్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది. (Ayushi Patel)
Ayushi Patel
Ayushi Patel : తెలుగు సినీ పరిశ్రమలో కలియుగ పట్టణంలో సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఢిల్లీ భామ ఆయుషి పటేల్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది. తన కొత్త సినిమా అనౌన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడింది.
ఆయుషి పటేల్ తన గురించి చెప్తూ.. సెయింట్ మేరీస్ హైస్కూల్లో చదివి, ఢిల్లీలోని అమిటీ యూనివర్సిటీలో బీటెక్ చేసి, లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో ఎంబీఏ చదివాను. చదువుతో పాటు సినిమాలు, కళలపై ఆసక్తి ఉంది. నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తాను. ఇప్పటివరకు 23 దేశాలను తిరిగేసాను. ఈ ప్రయాణంలో వివిధ దేశాల సంస్కృతులు, జీవన విధానాలను తెలుసుకున్నాను. అలాగే భారతదేశంలోని అన్ని జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకున్నాను. అది నా జీవితంలోని ప్రత్యేక అనుభవం అని చెప్పింది.
తన సినిమాల గురించి మాట్లాడుతూ.. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కథాకేళి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాను. తర్వాత విశ్వ కార్తికేయ హీరోగా 2024 లో కలియుగం పట్టణంలో సినిమాతో వచ్చి మంచి ప్రశంసలు అందుకున్నాను. నా పాత్రకు పేరొచ్చింది. ఇప్పుడు ‘టపక్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాక పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పిస్తాను. ఇవే కాకుండా మరో రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నాను. అవి త్వరలోనే ప్రకటించనున్నారు. సినిమాలతో పాటు జియో హాట్స్టార్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్నాను అని తెలిపింది.
అలాగే.. మంచి కథలను ఎంచుకుని ప్రతి సినిమాలో నా నటనని చూపిస్తాను. టాలీవుడ్ లో మంచి స్థానం సందించుకుంటాను సినిమా ఇండస్ట్రీలో అందం, ప్రతిభతో పాటు సరైన కథలు, పాత్రలు రావాలి. కష్టపడే తత్వం ఉండాలి అని తెలిపింది.

